Gold: తగ్గినట్లే తగ్గి,మళ్లీ పెరిగిన బంగారం ధర, తులం ధర ఎంతంటే..!
గత కొంతకాలంగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఒకానొక దశలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఆ బంగారం ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి.

బంగారానికి ఎప్పుడూ విలువైనదే. కానీ, ఇటీవలి కాలంలో బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల మార్పులు, కేంద్ర బ్యాంకుల బంగారు నిల్వల కారణంగా బంగారం రేట్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
గత కొంతకాలంగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఒకానొక దశలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఆ బంగారం ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి.
Gold
రికార్డుల గరిష్టాల నుంచి ఔన్స్ బంగారం రేటు 100 డాలర్ల మేర పడిపోయింది. వాటితో పాటు భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో దేశీయంగానూ బంగారం ధరలు దిగి వచ్చాయి.నిన్నటికి నిన్న తులం బంగారం ఏకంగా రూ.3వేల మేర దిగివచ్చింది.కానీ, ఆ మురిపం ఒక్కరోజే మిగిలింది.మళ్లీ గోల్డ్ ధరలు యూటర్న్ తీసుకున్నాయి. మళ్లీ బంగారం ధర పెరిగింది. అయితే.. తగ్గడం రూ.3వేలు తగ్గితే.. పెరగడం చాలా స్వల్పంగా పెరగడం గమనార్హం.
Gold
తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,819గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,899గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,827గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,907గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,825గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,905గా ఉంది.
Gold
హైదరాబాద్‌లో బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹88,819
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹96,899
విశాఖపట్నంలో ధరలు:
22 క్యారెట్లు: ₹88,827
24 క్యారెట్లు: ₹96,907
విజయవాడలో ధరలు:
22 క్యారెట్లు: ₹88,825
24 క్యారెట్లు: ₹96,905
ఈ రేట్లు నగల తయారీపై ఆధారపడి ఉండవచ్చు. మార్కెట్‌లో ఆభరణాల డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్పులతో పాటు స్థానిక మార్కెట్ పరిస్థితులు కూడా ధరలను ప్రభావితం చేస్తున్నాయి.