MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Gold: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర.. ఒక్క‌రోజే ఏకంగా రూ. 3వేలు డౌన్‌.. ఇంకా త‌గ్గ‌నుందా?

Gold: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర.. ఒక్క‌రోజే ఏకంగా రూ. 3వేలు డౌన్‌.. ఇంకా త‌గ్గ‌నుందా?

బంగారం అనే మాట ప‌ల‌కాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చిన విషయం తెలిసిందే. తులం బంగారం రూ. ల‌క్ష అవుతుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వింటూ వ‌చ్చాం. అయితే తాజాగా ఆ మార్కును కూడా దాటేసింది. ల‌క్ష దాటి ఇంకా పరుగులు పెట్టింది. అయితే అనూహ్యంగా బుధ‌వారం బంగారం ధ‌ర ఒక్క‌సారిగా త‌గ్గుముఖం ప‌ట్టింది. బుధ‌వారం ఒక్క‌రోజే తులంపై ఏకంగా రూ. 3 వేల వ‌ర‌కు త‌గ్గింది. ఇంత‌కీ ప్ర‌స్తుతం బంగారం ధ‌ర ఎంత ఉంది.? ఈ త‌గ్గుదల ఇలాగే కొన‌సాగుతుందా.? తెలుసుకుందాం..   

Narender Vaitla | Updated : Apr 23 2025, 06:00 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
gold price

gold price

చ‌రిత్ర‌లో తొలిసారి తులం బంగారం ధ‌ర ఏకంగా రూ. ల‌క్ష దాటేసింది. మంగ‌ళ‌వారం 24 క్యారెట్ల బంగారం ధ‌ర ఏకంగార రూ. 1,01,350 వ‌ద్ద న‌మోదైంది. దీంతో బంగారం ప్రియులు ఒక్క‌సారిగా షాక్‌కి గుర‌య్యారు. రానున్న రోజుల్లో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెర‌గ‌డం ఖాయ‌మ‌ని వాద‌న‌లు వినిపించాయి.

అయితే అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ బుధ‌వారం బంగారం ధ‌ర‌లు ఒక్క‌సారిగా త‌గ్గుముఖం ప‌ట్టాయి.  ఒక్క రోజే తులం గోల్డ్‌పై రూ. 3000 త‌గ్గింది. దీంతో ప్ర‌స్తుతం 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,350కి దిగొచ్చింది. మ‌రి దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

25
Asianet Image

* ఢి ల్లీలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90,030కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 98,500 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

* ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90,150కాగా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,350గా ఉంది. 

* చెన్నై విష‌యానికొస్తే ఇక్క‌డ బుధ‌వారం 22 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 90,150కాగా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,350 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

35
Asianet Image

* బెంగాళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 90,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,350 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

* పుణెలో కూడా 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90,150 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 98,350 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

* తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 90,150, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,350 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

45
Gold price today

Gold price today

బంగారం ధ‌ర‌లు ఎందుకు తగ్గాయి.? 

ఆశాఖ‌మే హ‌ద్దుగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఒక్క‌సారిగా త‌గ్గ‌డానికి కార‌ణాలు చాలానే ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చైనా, అమెరికాల మ‌ధ్య వాణిజ్య ఒప్పందాల్లో కాస్త సానుకూల వాతావ‌ర‌ణం క‌నిపిస్తుండ‌డంతో మార్కెట్లు మ‌ళ్లీ పుంజుకున్నాయి. అలాగే డాల‌ర్ విలువ క్ర‌మంగా బ‌ల ప‌డుతోంది. దీంతో గోల్డ్‌పై పెట్టుబ‌డి పెట్టిన వాళ్లు కాస్త మ‌ళ్లీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండ‌డం బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణం కావొచ్చ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

55
Asianet Image

ఇంకా త‌గ్గ‌నున్నాయా.? 

బంగారం ధ‌ర‌లు ఇంకా త‌గ్గ‌నున్నాయా.? అంటే.. క‌చ్చితంగా ఆ అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వాణిజ్య ఉద్రిక‌త్త‌లు త‌గ్గుముఖం ప‌డుతుండ‌డం. శాంతి చ‌ర్చ‌ల‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించ‌డం వంటి అంశాల‌న్నీ బంగారం ధ‌ర త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డుతుండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
బంగారం
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved