MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Today Gold Price: మధ్యతరగతి ప్రజలపై పిడుగు..కేంద్రం నిర్ణయంతో రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు

Today Gold Price: మధ్యతరగతి ప్రజలపై పిడుగు..కేంద్రం నిర్ణయంతో రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు

Today Gold Price: పసిడి ప్రియులు, సామాన్యుల నెత్తిపై ఒక్కసారిగా పిడుగు పడినట్లైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లు పాతాళానికి పడిపోయాయి. బంగారం ధరలు రాకెట్‍లా ఆకాశానికి దూసుకెళ్లాయి. కొనుగోలుదారులు, మధ్యతరగతి ప్రజలపై భారీ భారం పడింది. 

2 Min read
Author : Nandini Arava
Published : May 13 2026, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్ కుదేలు
Image Credit : iSTOCK

దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్ కుదేలు

దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. గతంలో 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం మార్కెట్‌లో కలకలం రేపింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన గంటల్లోనే హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు అగ్నిపర్వతంలా పేలాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రూ.1,67,890కు చేరిన మేలిమి బంగారం
Image Credit : Asianet News

రూ.1,67,890కు చేరిన మేలిమి బంగారం

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.13,910 పెరిగి రూ.1,67,890కు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా రూ.12,750 పెరిగి రూ.1,53,900 పలుకుతోంది. వెండి, ప్లాటినమ్ వంటి విలువైన లోహాలపై కూడా సుంకాలు పెరగడంతో మొత్తం బులియన్ మార్కెట్ వేడెక్కిపోయింది. 

Related Articles

Related image1
Gold Price: అమాంతం పెరిగిన బంగారం ధరలు.. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడికి చుక్కలే !
Related image2
Gold: మోడీ చెప్పినట్టు ప్రజలు బంగారం కొనడం మానేస్తే ఏమవుతుంది? ఎంతమంది వీధిన పడతారో తెలుసా?
36
 దిగుమతి ఖర్చు పెరగడమే కారణం
Image Credit : our own

దిగుమతి ఖర్చు పెరగడమే కారణం

అసలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణం దిగుమతి ఖర్చు ఒక్కసారిగా పెరగడమే. భారత్‌లో వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఇప్పుడు సుంకం 15 శాతానికి చేరడంతో దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. దాని ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్‌పై పడింది. జ్యువెలరీ వ్యాపారులు వెంటనే కొత్త రేట్లు అమలు చేయడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురయ్యారు. 

46
మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారం
Image Credit : iSTOCK

మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారం

ఇప్పటికే అంతర్జాతీయంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్ మార్పులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం మార్కెట్‌పై మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గరపడుతున్న సమయంలో ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారం కానుంది. 

56
మోదీ ప్రకటనతో బంగారం కొనుగోళ్లపై ప్రభావం
Image Credit : stockPhoto

మోదీ ప్రకటనతో బంగారం కొనుగోళ్లపై ప్రభావం

ఇటీవల ప్రధాని మోదీ కూడా దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. విదేశీ కరెన్సీ వ్యయాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల తర్వాతే దిగుమతి సుంకాల పెంపు జరిగింది. దీంతో ప్రభుత్వం బంగారం దిగుమతులను నియంత్రించాలనే వ్యూహంతో ముందుకెళ్తోందనే చర్చ జరుగుతోంది. 

66
అక్రమ బంగారం రవాణా పెరిగే ప్రమాదం ఉందంటున్న నిపుణులు
Image Credit : iSTOCK

అక్రమ బంగారం రవాణా పెరిగే ప్రమాదం ఉందంటున్న నిపుణులు

అయితే ఈ నిర్ణయం వల్ల అక్రమ బంగారం రవాణా పెరిగే ప్రమాదం ఉందని కొందరు మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో కొందరు ఇన్వెస్టర్లు ఇప్పుడు కూడా కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. తాజా నిర్ణయం బంగారం మార్కెట్‌లో భారీ ప్రకంపనలు సృష్టించింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపైనే ఇప్పుడు గోల్డ్ మార్కెట్ భవిష్యత్ ఆధారపడి ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Price: అమాంతం పెరిగిన బంగారం ధరలు.. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడికి చుక్కలే !
Recommended image2
Gold: మోడీ చెప్పినట్టు ప్రజలు బంగారం కొనడం మానేస్తే ఏమవుతుంది? ఎంతమంది వీధిన పడతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved