MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Gold Rate Fall: బంగారం ధరల్లో అనూహ్య మార్పు.. రిస్క్ లేదంటున్న నిపుణులు..!

Gold Rate Fall: బంగారం ధరల్లో అనూహ్య మార్పు.. రిస్క్ లేదంటున్న నిపుణులు..!

Gold Rate Fall: బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇవాళ భారీ గుడ్ న్యూస్. మళ్లీ పసిడి ధరలు దిగొచ్చాయి. ఇవాళ ఒక్కరోజే వెయ్యి రూపాయలు కుప్పకూలింది. ఈ భారీ తగ్గుదలకు కారణం ఏంటి? ఇంకా తగ్గుతాయా? 

1 Min read
Author : Nandini Arava
Published : Jul 01 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారం మార్కెట్‌లో అనూహ్య మార్పు
Image Credit : stockPhoto

బంగారం మార్కెట్‌లో అనూహ్య మార్పు

బంగారం మార్కెట్‌లో ఈరోజు అనూహ్య మార్పు కనిపించింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఉన్న గోల్డ్ రేట్లు...ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారిలో కొత్త ఆశలు మొదలయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పతనమవుతున్న పసిడి..స్థిరంగా వెండి
Image Credit : Getty

పతనమవుతున్న పసిడి..స్థిరంగా వెండి

హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే... 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.1,260 తగ్గి...రూ.1,40,780కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,150 పతనమై రూ.1,29,050 వద్ద స్థిరపడింది.పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న కుటుంబాలకు ఇది కొంత ఉపశమనంగా చెప్పొచ్చు.

అయితే బంగారం తగ్గినా... వెండి మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. బంగారం మార్కెట్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నప్పటికీ వెండి మాత్రం స్థిరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Related image1
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Related image2
Gold Price: బంగారం మళ్లీ పతనమైంది...పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ మంటలు..ఈసారి మరింత పతనం తప్పదా?
34
అంతర్జాతీయ మార్పుల ప్రభావం
Image Credit : Getty

అంతర్జాతీయ మార్పుల ప్రభావం

మార్కెట్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం... అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు... ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతేకాదు... అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. 

44
దశలవారీగా కొంటే రిస్క్ తగ్గొచ్చు
Image Credit : our own

దశలవారీగా కొంటే రిస్క్ తగ్గొచ్చు

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సింగపూర్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. దుబాయ్ మార్కెట్‌లో కూడా రేట్లు దిగివచ్చాయి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... ధరలు తగ్గుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి మళ్లీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకేసారి మొత్తం కొనుగోలు చేయకుండా... రోజువారీ ధరలను గమనిస్తూ దశలవారీగా కొనుగోలు చేస్తే రిస్క్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Recommended image2
Gold Price: బంగారం మళ్లీ పతనమైంది...పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ మంటలు..ఈసారి మరింత పతనం తప్పదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved