MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Business
  • Gold Price Hike: ట్రంప్ నిర్ణయంతో దూసుకెళ్లిన పసిడి.. ఈ వరలక్ష్మీ వ్రతానికి బంగారం కష్టమే

Gold Price Hike: ట్రంప్ నిర్ణయంతో దూసుకెళ్లిన పసిడి.. ఈ వరలక్ష్మీ వ్రతానికి బంగారం కష్టమే

Gold Price Hike: బంగారం, వెండి ధరలు ఇవాళ చాలా పెద్ద షాక్ ఇచ్చాయి. శ్రావణమాసం ఎఫెక్ట్ చూపించింది. భారీగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ పెరుగుదల భారంగా మారింది.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 20 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పసిడి ప్రియులకు ఊహించని షాక్
Image Credit : chatgpt

పసిడి ప్రియులకు ఊహించని షాక్

పసిడి ప్రియులకు బంగారం ఊహించలేని షాక్ ఇచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ తారాస్థాయికి చేరడంతో ఒక్కరోజే దాదాపు రూ.5వేల పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఈనెల వరలక్ష్మీ వ్రతాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. పూజకు బంగారం కొనాలనే సంప్రదాయం ఉంది. అందుకే చాలా మంది బంగారం కొనేందుకు ఎగబడతారు. ఈ డిమాండ్ కూడా ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రూ.1,59,270కి చేరిన పసిడి
Image Credit : Asianet News

రూ.1,59,270కి చేరిన పసిడి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ పెరుగుదల మరింత భారంగా మారింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,300 పెరిగి రూ.1,59,270కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.3,950 పెరిగి రూ.1,46,000కు చేరింది. వెండి ధర కూడా ఒక్కరోజులో కిలోకు రూ.10,000 మేర పెరిగింది.

Related Articles

Related image1
Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?
Related image2
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
36
అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణ
Image Credit : chatgpt

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణ

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులే పసిడి ధరలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు, ఇతర రిస్క్‌ ఉన్న ఆస్తుల కంటే బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ పెట్టుబడులు పెడుతున్నారు.

46
ఇరాన్‌పై ఆర్థిక యుద్ధానికి సిద్ధమైన ట్రంప్
Image Credit : Getty

ఇరాన్‌పై ఆర్థిక యుద్ధానికి సిద్ధమైన ట్రంప్

ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌కు ఆర్థికంగా సహకరించే దేశాలు, సంస్థలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, నగదు బదిలీలు, షిప్పింగ్, ఆర్థిక సంస్థలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా ఇరాన్‌కు అందుతున్న ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా చర్యలు ఉండనున్నాయి. ట్రంప్ ప్రకటనతో ప్రపంచ వాణిజ్యంపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలు తమ లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారత్‌పై అమెరికా నేరుగా కొత్త ఆంక్షలు విధించిందని చెప్పడం ప్రస్తుతానికి సరైనది కాదు.

56
తగ్గిపోయిన భారత్-ఇరాన్ వాణిజ్యం
Image Credit : x.com/IDF

తగ్గిపోయిన భారత్-ఇరాన్ వాణిజ్యం

భారత్-ఇరాన్ మధ్య వాణిజ్యం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. గతంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం భారీ స్థాయిలో ఉండేది. అయితే అమెరికా ఆంక్షలు, ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లలో వచ్చిన మార్పులు, అంతర్జాతీయ చెల్లింపుల సమస్యల కారణంగా ఈ వాణిజ్యం క్రమంగా తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం 2025-26లో భారత్ ఇరాన్‌కు సుమారు 1.25 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయగా.. ఇరాన్ నుంచి భారత్ దిగుమతులు సుమారు 0.37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

66
బంగారం ధరల ద్వారా భారత్‌పై పడే అవకాశం
Image Credit : X

బంగారం ధరల ద్వారా భారత్‌పై పడే అవకాశం

అయితే భారత్‌కు అసలు పెద్ద ఆందోళన ఇరాన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం కంటే చమురు ధరలు. అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే పశ్చిమాసియాలో చమురు సరఫరా, రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగొచ్చు. చమురు ధరలు పెరిగితే భారత్‌పై దాని ప్రభావం విస్తృతంగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి రావడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. తయారీ రంగం నుంచి ఆహార పదార్థాల వరకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్యులపై కూడా భారం పడొచ్చు.

ఇక ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు పెరిగిన ప్రతిసారీ బంగారం వైపు పెట్టుబడులు పెరగడం సహజం. అందుకే ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం పసిడి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. ఇరాన్‌తో భారత్‌కు ఉన్న వాణిజ్యం ప్రస్తుతం పరిమిత స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఇరాన్‌పై అమెరికా ఆర్థిక యుద్ధం ప్రభావం చమురు, షిప్పింగ్, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, బంగారం ధరల ద్వారా భారత్‌పై పడే అవకాశం ఉంది. అందుకే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలే బంగారం ధరలకు కీలక దిశానిర్దేశం చేయనున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Recommended image2
ATM: భారతదేశంలో మొట్టమొదటి ATM ఎక్కడ ఏర్పాటైంది? దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో తెలుసా.?
Recommended image3
Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?
Related Stories
Recommended image1
Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?
Recommended image2
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved