బంగారం ధర రూ.70వేలు దాటే ఛాన్స్.. దీపావళికి ముందు నేడు 22K తులం పసిడి, కేజీ వెండి ధర ఎంతంటే.?
ఒక వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది, దింతో పది గ్రాముల పసిడి ధర రూ. 61,640కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 పెరిగి 10 గ్రాములకి రూ.56,500 వద్ద నిలిచింది. వెండి ధర రూ.700 పెరిగి, ఒక కిలోకి రూ.74,800గా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే వచ్చే ఏడాది బంగారం ధర రూ.70,000 దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలకు అనుగుణంగా రూ.61,640 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.61,790,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,640,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,130గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలతో సమానంగా రూ.56,500 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,950గా ఉంది.
0112 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు $1,985.09 వద్ద దాదాపు ఫ్లాట్‌గా ఉంది, US గోల్డ్ ఫ్యూచర్స్ $1,992.40 వద్ద కొద్దిగా మారాయి.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.3 శాతం తగ్గి 22.68 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం పెరిగి 921.02 డాలర్లకు, పల్లాడియం 1.5 శాతం పెరిగి 1,116.57 డాలర్లకు చేరుకుంది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,800గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,700 వద్ద ట్రేడవుతోంది.
ఈ రోజు విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 56,500, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 ఎగిసి రూ. 61,640. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 77,700.
విదేశాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు):
మలేషియా: 2,980 రింగ్గిట్ (52,192 రూపాయలు)
దుబాయ్: AED 2,230 (రూ. 50,529)
US: 610 డాలర్లు (50,764 రూపాయలు)
సింగపూర్: 843 సింగపూర్ డాలర్లు (51,472 రూపాయలు)
ఖతార్: 2,290 ఖతార్ రియాల్ (రూ. 52,253)
సౌదీ అరేబియా: 2,300 సౌదీ రియాల్ (రూ. 51,021)
ఒమన్: 242.50 ఒమానీ రియాల్ (రూ. 52,417)
కువైట్: 191 కువైట్ దినార్ (రూ. 51,446)
హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 56,500 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెంపుతో రూ. 61,640. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.77,700.
అయితే, ఇక్కడ పేర్కొన్న రేట్లు కేవలం సూచిక మాత్రమే అని గమనించాలి. ఎందుకంటే వీటిలో GST, TCS ఇతర లెవీలు ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం తప్పనిసరిగా వారి స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాలి.