TV Low Cost: కొత్త టీవీలు కొనేందుకు సిద్ధమైపోండి, టీవీలు వేల రూపాయలు తగ్గబోతున్నాయి
జీఎస్టీ వల్ల టీవీ ధరలు అమాంతం తగ్గబోతున్నాయి. జీఎస్టీ పన్నులు తగ్గడం వల్ల టీవీలు తక్కువ ధరకే వస్తాయి. మీరు టీవీ కొనాలనుకుంటే సెప్టెంబరు 22 తరువాత కొనేందుకు ప్రయత్నించండి. వేల రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

జిఎస్టి పన్ను వల్ల లాభాలు
జిఎస్టి పన్ను విధానం ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆ పన్ను అమల్లోకి రావడం కోసం ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. జీఎస్టీలో మార్పుల వల్ల గృహోపకరణాల నుండి ఆహార పదార్థాల వరకు అనేక ధరలు తగ్గబోతున్నాయి. దీంతో సామాన్యులకు జీవితం మరింత సులభతరం అవుతుంది. ఆగస్టులో ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జిఎస్టి పన్ను తగ్గింపును ప్రకటించారు. ఆ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరిగింది.
జీఎస్టీ స్లాబులు
ప్రస్తుతం అమలులో ఉన్న 5%, 12%, 18%, 28% జిఎస్టి పన్ను స్లాబులు ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందులో 12 శాతం, 28 శాతం శ్లాబులను తొలగించారు. వీటి స్థానంలో 5 శాతం, 18 శాతం మాత్రమే అమలులో ఉంటాయి. దీంతో ఆహార పదార్థాలు, విద్యా సామగ్రి ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
టీవీల ధరలు తగ్గనున్నాయి
ప్రతి ఇంట్లో ఏసీ, టీవీ, వాషింగ్ మెషిన్, మొబైల్ ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు వాటి ధరలు అమాంతం తగ్గుతాయి. అలాగే కంప్యూటర్లు, సిమెంట్, ఐస్ క్రీం, జ్యూస్, ప్యాక్ చేసిన ఆహారం, అనేక వస్త్రాలపై పన్ను 18శాతానికి తగ్గుతున్నాయి. ముఖ్యంగా టీవీ ధరలు ఎంతగా తగ్గుతాయో ఇక్కడ ఇచ్చాము.
జీఎస్టీ పన్ను తగ్గడం 42 అంగుళాల టీవీ ధర ₹2,000 వరకు తగ్గే అవకాశం ఉంది. 75 అంగుళాల టీవీ ధర ₹23,000 వరకు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విధంగా నిర్మాణ సామగ్రి ధరలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి.
నిర్మాణ సామగ్రి ధరలు
సిమెంట్ పై జిఎస్టి పన్ను 28 శాతం నుండి 18 శాతానికి, ఇటుకలపై 12 శాతం నుండి 5 శాతానికి, మట్టి-సున్నం కలిపిన రాళ్లపై 12 శాతం నుండి 5 శాతానికి, గ్రానైట్, మార్బుల్ వంటి రాళ్లపై 12 శాతం నుండి 5 శాతానికి తగ్గుతోంది. దీని వల్ల ఇల్లు కట్టడం, కొనడం సులభంగా మారుతుంది.