- Home
- Business
- Car Prices Down: దీపావళికి భారీగా తగ్గనున్న హ్యుండాయ్ కారు ధరలు, ఇంతకన్నా మంచి ఆఫర్ రాకపోవచ్చు
Car Prices Down: దీపావళికి భారీగా తగ్గనున్న హ్యుండాయ్ కారు ధరలు, ఇంతకన్నా మంచి ఆఫర్ రాకపోవచ్చు
దీపావళికి నెలరోజుల ముందునే హ్యూండయ్ కంపెనీ పెద్ద బహుమతిని ప్రకటించేసింది. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ఆ ప్రయోజనాలన్నీ తమ కస్టమర్లకు అందిస్తామని ప్రకటించింది. హ్యాండయ్ కార్లు ధరలు ఇప్పుడు భారీగా తగ్గబోతున్నాయి.

హ్యుండయ్ కారు బంపర్ ఆఫర్
కారు కొనాలని కల కనే వారికి ఇది మంచి శుభవార్త. దీపావళికి కారు కొనేందుకు సిద్ధమైపోండి. జీఎస్టీ స్లాబులు మారడంతో కార్ల ధరలు తగ్గిపోతున్నాయి. ముందుగా hyundai మోటార్ ఇండియా తమ కస్టమర్లకు పెద్ద బహుమతిని ప్రకటించింది. తమ కార్ల ధరలను తగ్గించుతున్నట్టు ప్రకటించింది.
జీఎస్టీ పన్నుల ప్రభావం వల్ల
ప్రభుత్వం ఇటీవల జిఎస్టి పన్నులను తగ్గించింది. ఆ జీఎస్టీ పనుల ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు ఇస్తామని కంపెనీ ప్రకటించింది. వాహనాల ధరలు తగ్గిస్తున్నట్టు చెప్పింది. వివిధ రకాల మోడళ్లకు చెందిన కార్లపై 60,000 రూపాయల నుండి రెండు లక్షల 40 వేల రూపాయల వరకు ధరలు తగ్గిస్తున్నట్టు చెప్పింది. దీనివల్ల కారు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయము అనే చెప్పాలి.
పన్ను ఎంత తగ్గింది?
కొత్త జీఎస్టీ స్లాబుల వల్ల చిన్న కార్లపై పన్ను 28 శాతం నుండి 18 శాతానికి తగ్గింది. చిన్న కార్లు అంటే నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే కార్లు అలాగే పెట్రోల్ 1200 సిసి, లేదా డీజిల్ 1500 సిసి ఇంజన్ కలిగిన కార్లను కూడా చిన్న వాహనాలగానే పరిగణిస్తారు. అదే పెద్ద వాహనాలపై అయితే 40 శాతం జీఎస్టీ పడుతుంది.
ఏ కారుపై ఎంత తగ్గుతుంది?
హ్యుండాయ్ కంపెనీకి చెందిన కార్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఏ కారుపై ఎంత తగ్గింపు వస్తుందో ఇక్కడ ఇచ్చాము.
ఆరా - రూ. 78,465
ఎక్స్టీరియర్ - రూ. 89,209
i20 - రూ. 98,053
గ్రాండ్ i10 నియోస్ - రూ. 73,808
i20 N లైన్ - రూ. 1,08,116
వెన్యూ - రూ. 1,23,659
క్రెటా N లైన్ - రూ. 71,762
వెన్యూ N లైన్ - రూ. 1,19,390
వెర్నా - రూ. 60,640
క్రెటా - రూ. 72,145
అల్కాజార్ - రూ. 75,376
టక్సన్ - రూ. 2,40,303
మిడ్ రేంజ్ కార్లపై
ఈ తగ్గింపు వల్ల ఎక్కువ ప్రయోజనాలు కస్టమర్లకి స్పష్టంగా దక్కుతాయి. టక్సన్ వంటి ప్రీమియం SUVలపై రెండు లక్షల 40 వేల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అదే వెన్యూ, ఐ20.. మిడ్ రేంజ్ కార్లపై లక్ష రూపాయల వరకు తగ్గుతుంది. కాబట్టి మీకు కారు కొనాలన్నా కోరిక ఉంటే ఈ సమయంలోనే మీరు ఆ కళ్ళను నెరవేర్చుకోవచ్చు.