- Home
- Business
- తీరిక చేసుకొని మరీ కుంభమేళాకు వచ్చారు.. భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీ ఆధ్యాత్మితకు అంతా ఫిదా
తీరిక చేసుకొని మరీ కుంభమేళాకు వచ్చారు.. భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీ ఆధ్యాత్మితకు అంతా ఫిదా
భారతీయ కుబేరుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన బిజీ షెడ్యూల్ ని కాస్త పక్కన పెట్టి మరీ పవిత్ర స్నానం కోసం ప్రయాగ్ రాజ్ వచ్చేశారు. కుంభమేళలో గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ దర్శనం చేసుకున్నారు. బడే హనుమాన్ ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
15

గంగా స్నానం తర్వాత హనుమాన్ దర్శనం
మహా కుంభమేళలో పాల్గొన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ గంగా స్నానం ఆచరించిన అనంతరం కుటుంబంతో కలిసి బడే హనుమాన్ ఆలయంలో దర్శనం చేసుకున్నారు.
25
వైరల్ అవుతున్న ఫోటోలు
ఆలయంలో పూజలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయ సంప్రదాయాల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.
35
హనుమాన్ దర్శనం
హనుమాన్ దర్శనం చేసుకుంటున్నప్పుడు గౌతమ్ అదానీ ముఖంలో ప్రశాంతత కనిపించింది. ఆయన స్వయంగా హారతి ఇస్తున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
45
కట్టుదిట్టమైన భద్రత
గౌతమ్ అదానీ దర్శనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ ని తరలించారు.
55
అదృష్టవంతుడిని అన్న అదానీ
ఈ సందర్భంగా అభిమానులను కలిసిన గౌతమ్ అదానీ, గంగా స్నానం, హనుమాన్ దర్శనం తర్వాత తాను అదృష్టవంతుడినని భావిస్తున్నట్లు చెప్పారు.
Latest Videos