ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్: భారీ డిస్కౌంట్‌తో TVS ఐక్యూబ్!
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా TVS కంపెనీ తన న్యూ మోడల్ ఐక్యూబ్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మీరు గాని టీవీఎస్ కంపెనీ స్కూటర్ కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి టైం. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఇవిగో.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో TVS ఐక్యూబ్ ఎప్పుడూ టాప్ 3లో ఉంటుంది. ప్రీ-రిపబ్లిక్ డే సేల్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే బొనాంజా సేల్ ఐక్యూబ్‌పై కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లను తెస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే బొనాంజా సేల్
ఫ్లిప్‌కార్ట్‌లో ఐక్యూబ్ 2.2 kWh మోడల్ రూ.1,05,200 ధర ఉంది. బొనాంజా సేల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు రూ. 88,349కి లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ అనేక డిస్కౌంట్‌లను అందిస్తుంది. వీటిని కలిపి ఉపయోగించుకుంటే మీకు మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ 'ఓన్లీ ఫర్ యూ' డిస్కౌంట్‌గా రూ. 2,000 ఇస్తుంది.
అదనంగా రూ. 20,000 పైన ఉన్న ఏదైనా ఉత్పత్తిపై ఈ-కామర్స్ దిగ్గజం అదనంగా రూ. 12,300 తగ్గింపును అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 5,265 వరకు తగ్గింపు వంటి అనేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
క్రెడిట్ కార్డ్‌లపై డిస్కౌంట్‌లతో ఈజీ EMI కొనుగోలు ఎంపికలు కూడా బొనాంజా సేల్ లో అందుబాటులో ఉన్నాయి.
TVS ఐక్యూబ్ స్పెసిఫికేషన్స్
TVS ఐక్యూబ్ 2.2 kWh బేస్ మోడల్ 4 bhp, 33 Nm టార్క్‌ను అందిస్తుంది. TVS మోటార్ ప్రకారం ఐక్యూబ్ గరిష్ట వేగం 75 kmph. అంతేకాకుండా ఒక్క ఛార్జ్ తో 75 km వరకు పరుగులు పెడుతుంది. బ్యాటరీ 2 గంటల 45 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
ఆటోమేటిక్ డే/నైట్ మోడ్‌తో 5-అంగుళాల TFT డిజిటల్ క్లస్టర్ అమర్చారు. ఈ ఐక్యూబ్ స్కూటర్ లో నంబర్ ప్లేట్ వరకు LED లైట్ అమర్చారు. హార్డ్‌వేర్ పరంగా ఇది 220 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 mm రియర్ డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంది. అదే సమయంలో 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అంతేకాకుండా 770 mm సౌకర్యవంతమైన సీట్ హైట్ నడిపేవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది.