- Home
- Business
- Flipkart: కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌కి సిద్ధమవ్వండి.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ఎప్పటి నుంచంటే
Flipkart: కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌కి సిద్ధమవ్వండి.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ఎప్పటి నుంచంటే
Flipkart republic day Sale: ప్రతీ ఏటా రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించే ఫ్లిప్‌కార్ట్ ఈసారి కూడా సేల్‌కి సిద్ధమైంది. సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది.? ఎలాంటి ఆఫర్లు ఉండనున్నాయంటే..

జనవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్
దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన 2026 రిపబ్లిక్ డే సేల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ జనవరి 17, 2026 నుంచి ప్రారంభం కానుంది. భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ప్రత్యేక డీల్స్‌తో ఈ సేల్ వినియోగదారులను ఆకర్షించనుంది. జనవరి 26, 2026 వరకు ఈ సేల్ కొనసాగనుంది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు ముందస్తు అవకాశం
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులకు ఈ సేల్‌లో ప్రత్యేక లాభం ఉంది. సాధారణ వినియోగదారుల కంటే 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనే అవకాశం ఇస్తున్నారు. అంటే ప్లస్ యూజర్లు జనవరి 16, 2026 నుంచే డిస్కౌంట్ ధరలతో కొనుగోళ్లు చేయవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ సౌకర్యాలు
ఈ రిపబ్లిక్ డే సేల్‌లో వినియోగదారులకు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయన్సెస్ కొనుగోలుకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటుంది.
ఏ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు?
2026 ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ప్రధానంగా రెడ్‌మీ నోట్ 15, పోకో M8 5G, ఓప్పో రెనో 15 సిరీస్‌తో పాటు షియోమీ, మోటోరోలా, పోకో, వివో, గూగుల్ పిక్సెల్ వంటి బ్రాండ్ల ఫోన్లపై కూడా అద్భుతమైన ఆఫర్లు లభించనున్నాయి.
హోమ్ అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో హోమ్ అప్లయన్సెస్‌పై కూడా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ప్రధానంగా ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌ల వంటి వాటిపై ప్రత్యేక ధరలు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇంటి అవసరాల కోసం పెద్ద కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మొత్తంమీద 2026 ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీగా షాపింగ్ చేసే మంచి అవకాశంగా మారనుంది.

