PPF KYC ITR Filing త్వరపడండి.. పీఎఫ్ కేవైసీ సమయం ఇంకా మూడ్రోజులే!
2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. వెంటనే పీఎఫ్ సంబంధిత పనులు ఏవైనా పెండింగ్ ఉంటే మార్చి 31లోగా పూర్తి చేసుకోండి. పీపీఎఫ్ కనీస మొత్తం డిపాజిట్, ఫాస్టాగ్‌కు కేవైసీ, ఐటీఆర్ ఫైలింగ్ వంటి ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయండి.
13

2024-25 ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉంది. సమయం ఇంక మూడు రోజులే మిగిలి ఉంది. మార్చి 31లోగా మీ పీఎఫ్ సంబంధిత పనులను పూర్తి చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
23
ఆర్థిక పెట్టుబడులు, వాటికి సంబంధించిన పనుల కోసం తక్కువ సమయం ఉంది. ఈ వారంలో 2 రోజులు బ్యాంక్ సమ్మె కూడా జరగనుంది. ఏదేమైనా, మార్చి 31లోగా పీఎఫ్, ఇతర ముఖ్యమైన పనులను పూర్తి చేయండి. పీపీఎఫ్ కనీస మొత్తం డిపాజిట్, ఫాస్టాగ్‌కు కేవైసీ, ఐటీఆర్ ఫైలింగ్, టీడీఎస్ ఫైలింగ్ తప్పనిసరిగా చేయండి.
33
పీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేటు ఇతర ఖాతాల కంటే ఎక్కువ. డబ్బులు జమ చేయకపోతే ఆ ప్రయోజనం పొందలేరు. పీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఇకపై ఉండవు. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయకపోతే వెంటనే చేయండి.
Latest Videos