MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • PF Withdraw: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ మొత్తం డ్రా చేసుకోవచ్చు, కొత్త రూల్స్ ఇవే

PF Withdraw: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ మొత్తం డ్రా చేసుకోవచ్చు, కొత్త రూల్స్ ఇవే

PF Withdraw: ఎపీఎఫ్ఓ రూల్స్ మారిపోయాయి. ఇక నుంచి… ఉద్యోగులు.. తాము ప్రతి నెలా దాచుకున్న పీఎఫ్ డబ్బులను కొంచెం కొంచెం గా కాకుండా.. ఒకేసారి 100 శాతం తీసుకోవచ్చు.  ఈ మేరకు అధికారులు కొత్త రూల్స్ తీసుకున్నారు.  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 09 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్...
Image Credit : Google

ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్...

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి ఖాతా లోనుంచి ప్రతి నెలా ఎంతో కొంత సొమ్ము పీఎఫ్ ఖాతాలో జమ అవుతూనే ఉంటుంది. దీనినే మనం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) అని పిలుస్తాం. అయితే.. ప్రతి నెలా మన డబ్బే దాచుకుంటున్నా కూడా.. మన అవసరానికి పూర్తిగా వాడుకోలేం. ఈ పీఎఫ్ డబ్బులు వాడుకోవాలంటే చాలా రూల్స్ ఉంటాయి. అయితే.. ఈ రూల్స్ ని తాజాగా EPOF అధికారులు కాస్త సరళం చేశారు. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశ పెట్టారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. మన పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బును 100 శాతం వాడుకునే అవకాశం కూడా ఉంది. అదెలాగో.. ఈ కొత్తరూల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డబ్బులు అవసరమా.. పీఎఫ్ ఉందిగా...
Image Credit : iSTOCK

డబ్బులు అవసరమా.. పీఎఫ్ ఉందిగా...

నిజానికి.. పీఎఫ్ అనేది ఉద్యోగుల భవిష్యత్తు కోసమే ఏర్పాటు చేశారు.  ప్రతి నెలా వచ్చిన జీతంలో డబ్బులు మనం సేవ్ చేసినా, చేయకపోయినా… ఈ పీఎఫ్ లో కట్ అయిన డబ్బులతో అయినా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా జీవిస్తారనే ఉద్దేశంతోనే దీనిని ప్రవేశపెట్టారు. కానీ… భవిష్యత్తు సంగతి పక్కన పెట్టండి.. ఏదైనా అత్యవసరం వచ్చినా ఈ డబ్బులు వాడుకోలేకపోతున్నాం అని బాధపడేవాళ్లే చాలా మంది ఉన్నారు.  ముఖ్యంగా 100 శాతం పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే.. చాలా కారణాలు చెప్పాల్సి వచ్చేది. కొన్నిసార్లు.. ఆ కారణాలకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించాలి. అన్నీ చూపించినా కూడా.. అధికారులు రిజెక్ట్ చేస్తే… ఆ డబ్బులు వచ్చేవి కావు. కానీ.. ఇప్పుడు ఆ సమస్య లేకుండా.. మీ అవసరానికి తగినట్లు డబ్బును డ్రా చేసుకునే సదుపాయం తీసుకువచ్చారు.

34
100 శాతం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు..?
Image Credit : Asianet News

100 శాతం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు..?

మీరు పని చేస్తున్న కంపెనీ సడెన్ గా మూత పడినా, లేక జీతంలేకుండా ఉద్యోగం కోల్పోయినా,  సమ్మె కాకుండా ఇతర ఏవైనా కారణాల వల్ల రెండు నెలల జీతం రాకపోయినా.. మీరు పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు.  అంతేకాదు.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం కూడా మనం  డబ్బును పూర్తిగా డ్రా చేసుకునే సదుపాయం తీసుకువచ్చారు.

44
పాత రూల్స్, కొత్త రూల్స్ కీ తేడా ఏంటి?
Image Credit : our own

పాత రూల్స్, కొత్త రూల్స్ కీ తేడా ఏంటి?

గతంలో ఉన్న రూల్స్ ప్రకారం.. ఎలాంటి అత్యవసరం వచ్చినా కూడా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని  డబ్బును అత్యధికంగాా… 75 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు.  కానీ, ఈ కొత్త రూల్స్ ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో 100 శాతం డ్రా చేసుకోవచ్చు. 

ఈ కొత్త రూల్ ఉద్యోగులకు ఎలా ఉపయోగపడుతుంది..?

ఉద్యోగం కోల్పోవడం, జీతం ఆలస్యం కావడం లేదా ఆకస్మిక వైద్య ఖర్చులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇంత కాలం దాచుకున్న డబ్బును వాడుకొని.. ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇదది చాలా మందికి ఉపయోగపడే నిర్ణయమే. మరి… ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన నిర్ణయం పట్ల ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
Chicken Shop: చికెన్ బొక్కలు.. పీకేసిన ఈకలు..ఏముందక్కడ..? దీనికి అవార్డా..?
Recommended image2
Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved