MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • EPFO 3.0: జూన్‌ నుంచి ఏటీఎంలో కూడా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. కానీ.. ఆ కార్డు ఉండాలి

EPFO 3.0: జూన్‌ నుంచి ఏటీఎంలో కూడా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. కానీ.. ఆ కార్డు ఉండాలి

EPFO 3.0: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతా నుండి డబ్బును సులభంగా తీసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం EPFO 3.0 పథకాన్ని ప్రకటించింది. అంటే ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎం, యూపీఐ ద్వారా ఉపసంహరించుకోవచ్చన్న మాట. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 31 2025, 10:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమలులోకి రానున్న EPFO 3.0!
Image Credit : Freepik

అమలులోకి రానున్న EPFO 3.0!

గతంలో ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుండి డబ్బును విత్ డ్రా చేయాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుండి డబ్బును సులభంగా తీసుకొనేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇవి జూన్‌లో అమలులోకి రానున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ 3.0 (EPFO 3.0) అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ప్రకారం ఏటీఎం నుండి డబ్బును తీసుకున్నట్టుగానే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
EPFO 3.0 లో సదుపాయాలివి..
Image Credit : X

EPFO 3.0 లో సదుపాయాలివి..

ప్రస్తుతం EPFO సభ్యులు ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును ఉపసంహరించుకోవడానికి 10 నుండి 15 రోజుల వరకు పడుతుంది. కానీ పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడానికి కొత్త ఏటీఎం, యూపీఐ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు. ప్రారంభించిన తర్వాత పీఎఫ్ డబ్బు తీసుకోవడం నిమిషాల్లో పూర్తవుతుంది. అంతేకాకుండా EPFO 3.0 ద్వారా ఖాతా సవరణ, ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఫిర్యాదుల తక్షణ పరిష్కారం వంటి అనేక సేవలు డిజిటల్‌గా అందుబాటులోకి వస్తాయి.

35
ఎప్పుడు ప్రారంభం?
Image Credit : మాది

ఎప్పుడు ప్రారంభం?

EPFO 3.0 వ్యవస్థ జూన్ 2025లో ప్రారంభిస్తామని కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇది 9 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడానికి రూపొందించారు. 

ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బు తీసుకోవడానికి EPFO సభ్యులకు కొత్త EPF ఉపసంహరణ కార్డ్ అందజేస్తారు. డెబిట్ కార్డ్ లాగానే ఈ కార్డ్ ద్వారా బ్యాలెన్స్ చెక్, డబ్బు ఉపసంహరణ వంటివి చేసుకోవచ్చు.

45
ఎంత డబ్బు తీసుకోవచ్చు?
Image Credit : సోషల్ మీడియా

ఎంత డబ్బు తీసుకోవచ్చు?

ఏటీఎం, యూపీఐ ద్వారా మాక్సిమం రూ.1 లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చు. దీనివల్ల పని దినాల్లో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సమయం వృధా కావడం ఉంటుంది. అంతేకాకుండా కొత్త వ్యవస్థలో పీఎఫ్ క్లెయిమ్ ప్రక్రియ ఆటోమేటిక్‌గా (ఆటో మోడ్) జరిగేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

55
అకౌంట్ డీటైల్స్ ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు
Image Credit : FREEPIK

అకౌంట్ డీటైల్స్ ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు

EPFO 3.0 సిస్టమ్ లో సభ్యులు తమ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, శాశ్వత చిరునామా వంటి వివరాల్లో ఏవైనా లోపాలుంటే ఆన్‌లైన్ ద్వారా వెంటనే సవరించుకోవచ్చు. పాత పద్ధతిలో ఫారాలను నింపాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా భవిష్యత్తులో ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేలా సిస్టమ్ ఏర్పాటు చేశారు. యూపీఐ, ఏటీఎంలలో డబ్బును ఉపసంహరించుకోవడం కూడా ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image2
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Recommended image3
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Related Stories
Recommended image1
Rs. 20,000 Crore Investment from Amazon: వొడాఫోన్ ఐడియాలో అమెజాన్ రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డి..?
Recommended image2
Digital Banking Units: జూలై నాటికి 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved