- Home
- Business
- ఒకటికి మించి EMIలు కట్టలేకపోతున్నారా.? ఇలా చేస్తే మీ లైఫ్ బిందాస్, టెన్షన్ తగ్గించే బెస్ట్ ప్లాన్
ఒకటికి మించి EMIలు కట్టలేకపోతున్నారా.? ఇలా చేస్తే మీ లైఫ్ బిందాస్, టెన్షన్ తగ్గించే బెస్ట్ ప్లాన్
EMI: ఈ రోజుల్లో EMI అనేది ప్రతి మధ్యతరగతి జీవితంలో భాగంగా మారిపోయింది. ఒక్కసారిగా పెద్ద మొత్తం చెల్లించలేని పరిస్థితిలో నెలవారీ వాయిదాల పద్ధతిని చాలామంది ఎంచుకుంటున్నారు. అయితే ఒకటికి మించి ఈఎమ్ఐలు చెల్లించే వారికి ఓ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది.

EMIలు ఎందుకు భారంగా మారుతున్నాయి?
నెలకు వచ్చే జీతంలో పెద్ద భాగం EMIలకే వెళ్తోంది. రెండు లేదా మూడు కాదు… కొందరికి ఐదు, ఆరు EMIలు కూడా ఉంటున్నాయి. దాంతో సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. అత్యవసర అవసరాలకు డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. “అన్ని EMIలు ఒకే లోన్‌గా మారితే బాగుంటుంది” అని చాలామంది అనుకుంటారు. అలాంటి ఆలోచనకు పరిష్కారంగా ఓ కొత్త ప్లాన్ వచ్చింది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ కొత్త లోన్ స్కీమ్
EMI భారం తగ్గించేందుకు సౌత్ ఇండియన్ బ్యాంక్ Power CONSOL అనే కొత్త లోన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఒక వ్యక్తికి ఉన్న అనేక లోన్లను ఒకే లోన్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేటుతో ఒకే EMIగా చెల్లించే సౌకర్యం అందిస్తుంది. దీని వల్ల నెలవారీ చెల్లింపులు సులభంగా మారతాయి.
ఒకే లోన్‌లో ఏ ఏ అప్పులు కలుపుకోవచ్చు?
ఈ పథకం కింద హోం లోన్, కారు లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, దీర్ఘకాలిక అప్పులు అన్నింటినీ ఒకే లోన్‌గా మార్చుకోవచ్చు. కస్టమర్ తన ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీని పెట్టి ఆస్తి విలువలో 75 శాతం వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. రూ.10 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు లోన్ తీసుకునే వీలుంది.
ఎవరికీ ఉపయోగపడుతుంది? ప్రయోజనాలు ఏంటి?
30 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగులు, వ్యాపారం చేసేవారు, ఉద్యోగం లేని వారు కూడా ఈ స్కీమ్‌కు అర్హులు. కన్సాలిడేషన్ లోన్‌కు గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు రీపేమెంట్ గడువు ఉంటుంది. హోం లోన్ ట్రాన్స్‌ఫర్ అయితే 30 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ వల్ల వడ్డీ మొత్తం తగ్గుతుంది, నెలవారీ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. దీని ప్రభావం సిబిల్ స్కోర్‌పై కూడా పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ స్కీమ్ సక్సెస్ అయితే త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఇలాంటి ప్లాన్లు తీసుకొచ్చే అవకాశం ఉంది.

