రోజుకు కోటి కంటే పైగా సంపాదన; ఇతని గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్!
టిమ్ కుక్ ఇతను టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ డైరెక్టర్ల బోర్డులో టిమ్ కుక్ కూడా ఉన్నారు. ఆగష్టు 2011లో స్టీవ్ జాబ్స్ తర్వాత టిమ్ కుక్ ఆపిల్ అధికారాన్ని చేపట్టారు. ఆపిల్ CEO కాకముందు, టిమ్ కుక్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. టిమ్ కుక్ గురించి మీకు కొన్ని తెలియని వాస్తవాలను చూద్దాం..
టిమ్ కుక్ జీతం
ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రతిరోజు జీతం చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఓపెన్ సోర్స్ సమాచారం ప్రకారం టిమ్ కుక్ రోజుకు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. 2021లో అతని మొత్తం జీతం ప్యాకేజీ $98.7 మిలియన్లు అంటే 9కోట్లకు పైమాటే. ఆపిల్ 2022లో టిమ్ కుక్‌కి $99.4 మిలియన్లను చెల్లించిందని, ఇందులో $3 మిలియన్ల బేస్ సాలరీ, సుమారు $83 మిలియన్ల స్టాక్ అవార్డులు, బోనస్‌లు ఉన్నాయని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
టిమ్ కుక్ ఆస్తి
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం టిమ్ కుక్ మొత్తం విలువ 1.9 బిలియన్ డాలర్లు. టిమ్ కుక్ కి ఆపిల్ లో మూడు మిలియన్లకు పైగా షేర్లు ఉన్నాయి. ఫోర్బ్స్ బిలియనీర్ల లిస్ట్ లో టిమ్ కుక్ 1,647వ స్థానంలో నిలిచారు.