- Home
- Business
- Business Ideas: మీ మేడపై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే ఆడుతు పాడుతూ నెలకు రూ. 15 వేలు సంపాదన
Business Ideas: మీ మేడపై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే ఆడుతు పాడుతూ నెలకు రూ. 15 వేలు సంపాదన
Business Ideas: ఇళ్ల మేడపై ఉండే ఖాళీ ప్రదేశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఆదాయం వచ్చే వ్యాపారంగా మార్చుకోవచ్చు. చిన్న స్థలంలో కూడా టెర్రస్ వెజిటబుల్ ఫార్మింగ్ బిజినెస్ చేయొచ్చు. ఈ బిజినెస్ ఐడియాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టెర్రస్ వెజిటబుల్ ఫార్మింగ్ అంటే ఏమిటి?
ఇంటి మేడపై డ్రమ్స్, గ్రో బ్యాగ్స్, ట్రేలు ఉపయోగించి కూరగాయలు పెంచే విధానాన్ని టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఇది చిన్న స్థాయిలో ప్రారంభించి బిజినెస్ స్థాయికి తీసుకెళ్లొచ్చు. ఇటీవల ఈ బిజినెస్ మోడల్‌కి డిమాండ్ పెరుగుతోంది. టమోటా, మిర్చి, బెండకాయ, పాలకూర, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వంటి వాటిని పెంచొచ్చు. నగరాల్లో ఆర్గానిక్ కూరగాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇదే ఈ బిజినెస్ బలంగా చెప్పొచ్చు.
మేడపై ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
మొదట మేడపై నీటి లీకేజీ సమస్య లేకుండా చూసుకోవాలి. తర్వాత గ్రో బ్యాగ్స్ లేదా డ్రమ్స్, మంచి మట్టి, వర్మీ కంపోస్ట్, నీటి స్ప్రే సిస్టమ్, షేడ్ నెట్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. 100 గజాల మేడపై సుమారు 80–100 గ్రో బ్యాగ్స్ సులభంగా పెట్టొచ్చు. రోజుకు 1–2 గంటల పని సరిపోతుంది.
పెట్టుబడి ఎంత అవసరం?
ఈ బిజినెస్ పెద్ద పెట్టుబడి లేకుండా ప్రారంభించొచ్చు. అంచనా ఖర్చులు ఇలా ఉంటాయి.
గ్రో బ్యాగ్స్, డ్రమ్స్ – ₹20,000
మట్టి, కంపోస్ట్ – ₹10,000
నీటి వ్యవస్థ, షేడ్ నెట్ – ₹10,000
విత్తనాలు, చిన్న పరికరాలు – ₹5,000
మొత్తం పెట్టుబడి: ₹40,000 – ₹50,000
ఇది ఒకసారి పెట్టే ఖర్చు. తర్వాత నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
లాభాలు ఎలా ఉంటాయి?
నెలకు వచ్చే ఆదాయం పంటలపై ఆధారపడి ఉంటుంది. సగటు అంచనా ప్రకారం.. నెలకు కూరగాయల విక్రయం – రూ. 15,000 నుంచి రూ. 25,000 జరిగింది అనుకుందాం. రెస్టారెంట్స్, అపార్ట్‌మెంట్స్‌కు నేరుగా అమ్మకం చేస్తే ఆదాయం ఇంకా పెరుగుతుంది. అన్ని ఖర్చులు పోయినా నెలకు నికర లాభం రూ. 10,000 నుంచి రూ. 18,000 వరకు ఆదాయం పొందొచ్చు. ఇది ఇంటి మేడపై చేసే సైడ్ బిజినెస్ అయినా మంచి ఆదాయం ఇస్తుంది.
ఈ బిజినెస్ ప్రత్యేకతలు, భవిష్యత్తు అవకాశాలు
ఇంటి నుంచే వ్యాపారం, అదనపు అద్దె అవసరం లేదు అలాగే మహిళలు, రిటైర్డ్ వ్యక్తులకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. సమయం గడవడంతో పాటు ఆదాయం పొందొచ్చు. ఆర్గానిక్ బ్రాండ్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.
తర్వాతి దశలో ఆర్గానిక్ వెజిటబుల్ హోమ్ డెలివరీ చేయొచ్చు. టెర్రస్ గార్డెనింగ్ ట్రైనింగ్ క్లాసులు చెప్పొచ్చు. ఈ విధంగా చిన్న మేడ నుంచే పెద్ద బిజినెస్‌గా మార్చుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందు లాభనష్టాల గురించి స్పష్టంగా తెలియాలంటే అంతకుముందు ఈ రంగంలో అనుభవం ఉన్న వారిని నేరుగా సంప్రదిస్తే మరీ మంచిది.

