MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Dolo 650: అమ్మ బాబోయ్..డోలో 650 టాబ్లెట్ కంపెనీ ఓనర్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలిస్తే గుండె గుభేల్..ఇంత రిచ్చా

Dolo 650: అమ్మ బాబోయ్..డోలో 650 టాబ్లెట్ కంపెనీ ఓనర్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలిస్తే గుండె గుభేల్..ఇంత రిచ్చా

మన దేశంలో కరోనా టైంలో డోలో 650 టాబ్లెట్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. జ్వరం రాగానే ప్రతి ఒక్కరూ వెంటనే డోలో 650 టాబ్లెట్లు మింగేసేవారు. దీంతో డోలో 650 సేల్స్ ఒక్కసారిగా ఆకాశాన్ని తగ్గాయి.. అయితే తాజాగా డోలో 650 కంపెనీ యజమాని బెంగళూరులో ఓ రాజ భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు బయటపడ్డాయి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Krishna Adhitya
Published : Apr 27 2023, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Dolo 650

Dolo 650

డోలో 650 టాబ్లెట్  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశంలో ప్రతి ఇంట్లో కనిపించే మందు డోలో 650. కరోనా సమయంలో అందరూ డజన్ల కొద్దీ డోలో 650 టాబ్లెట్లను మింగేశారు. చాలా మంది డాక్టర్లు సైతం ఈ టాబ్లెట్ ను సిఫార్సు చేశారు. అయితే ఈ టాబ్లెట్ యాంటి పైరటిక్ లక్షణాలు కలిగిన పారసిటిమాల్ టాబ్లెట్ యొక్క 650 ఎంజీ మాత్రమే కావడం గమనార్హం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ముఖ్యంగా  కోవిడ్ సమయంలో భారతదేశంలో కోట్లాది మంది డోలో 650 మాత్రలు కొనుగోలు చేశారు. ఫలితంగా 2020లో డోలో కంపెనీ 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 2019 నుండి 2021 వరకు కంపెనీ ఆదాయంలో 244 శాతం పెరుగుదలను చూసింది. కోట్లకు కోట్లు సంపాదిస్తున్న డోలో కంపెనీ సీఈవో దిలీప్ సురానా ఇప్పుడు బెంగళూరులో రూ.66 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఉన్న ఈ ఇల్లు, ప్లాట్ ప్రాంతం 12,043 చ.అడుగులు ఇది 8,373 చదరపు అడుగులలో ఈ అద్భుతమైన బంగ్లాను నిర్మించారు. 

35

ఈ ఖరీదైన బంగ్లాను జిజి రాజేంద్ర కుమార్, సాధన, మను గౌతమ్ నుండి కొనుగోలు చేశారు. వారు ఈ ఇంటి కొనుగోలును నమోదు చేసుకున్నారు. దీని స్టాంప్ డ్యూటీ ఖరీదు రూ.3.33 కోట్లు. ఇప్పుడు బెంగళూరులోని అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో డోలో సీఈవో దిలీప్ సురానా చేరారు.
 

45

డోలో 650 మాత్రల భారీ వ్యాపారం జరగడంతో దిలీప్ సురానా నికర విలువ ఇప్పుడు రూ.26,000 కోట్లకు పెరిగింది. దిలీప్ సురా తండ్రి జిసి సురానా 1973లో బెంగళూరు వచ్చారు. జిసి సురానా వృత్తి రీత్యా అకౌంటెంట్, ఉద్యోగం వెతుక్కుంటూ బెంగళూరు వచ్చారు. అయితే ఢిల్లీకి చెందిన ఓ ఫార్మా కంపెనీలో మందులు అమ్ముతూ బెంగళూరులో కెరీర్ ప్రారంభించాడు. ఐదేళ్ల తర్వాత బెంగళూరులో మైక్రో ల్యాబ్స్‌ను ప్రారంభించాడు. 1983లో కుమారుడు దిలీప్ సురానా మైక్రో ల్యాబ్స్ కంపెనీలో బాధ్యతలు చేపట్టారు.  తరువాత, కర్ణాటకలోని బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ నుండి డోలో 650, ఇతర మందులు భారతదేశంలో మార్కెటింగ్ ప్రారంభించాయి. 
 

55

కోవిడ్ సమయంలో డోలో పిల్ భారీ వ్యాపారం చేసింది. మార్చి 2020 నుండి 2021 వరకు 567 కోట్లు ఆర్జించింది. మొత్తం 350 కోట్ల టాబ్లెట్లు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఈ మహమ్మారి సమయంలో, బెంగుళూరుకు చెందిన మైక్రోలాబ్స్ కంపెనీ డోలో 650 మాత్రలను వైద్యులు జ్వరం, నొప్పి నివారణగా సూచించడంతో భారీగా  విక్రయించారు. దేశంలో కోవిడ్ 2వ తరంగం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు 2021 ఏప్రిల్  నెలలోనే 49 కోట్ల మాత్రలు విక్రయించారు. ఆరోగ్య పరిశోధన సంస్థ IQVIA ప్రకారం, ఒకే నెలలో డోలో అమ్మకాలలో ఇది ఆల్ టైమ్ రికార్డ్.  

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved