MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • డీమార్ట్ లో సూపర్ ఆఫర్.. వీరికి ఇంటికే సరుకులు, మొదటి 3 ఆర్డర్లు ఫ్రీ డెలివరీ!

డీమార్ట్ లో సూపర్ ఆఫర్.. వీరికి ఇంటికే సరుకులు, మొదటి 3 ఆర్డర్లు ఫ్రీ డెలివరీ!

డీమార్ట్ ఆన్ లైన్ సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. డీమార్ట్ రెడీ యాప్ ద్వారా ఇంట్లోకి కావాల్సిన సరుకులను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. కొత్త కస్టమర్ల కోసం డీమార్ట్ రెడీ యాప్ మంచి ఆఫర్ ప్రకటించింది. అదేంటో చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Sep 23 2025, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డీమార్ట్ రెడీ యాప్ ఆఫర్
Image Credit : Dmart

డీమార్ట్ రెడీ యాప్ ఆఫర్

డీమార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లోకి కావాల్సిన చాలా రకాల వస్తువులు, సరుకులు డీమార్ట్ లో తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి చాలామంది డీమార్ట్ లో షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే డీమార్ట్ ఇటీవల ఆన్ లైన్ సర్వీసులు కూడా ప్రారంభించింది. దీంతో మనం ప్రత్యేకంగా డీమార్ట్ కి వెళ్లి సరుకులు కొనాల్సిన అవసరం లేదు. డీమార్ట్ రెడీ యాప్ ద్వారా మనకు కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. దానివల్ల శ్రమ, సమయం, డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు.

24
డీమార్ట్ రెడీ యాప్
Image Credit : DmartIndia

డీమార్ట్ రెడీ యాప్

కొత్త కస్టమర్ల కోసం డీమార్ట్ రెడీ ఒక గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. మొదటి మూడు ఆర్డర్లపై ఉచిత హోమ్ డెలివరీ లభిస్తుంది. అంటే డెలివరీ ఛార్జీల గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన వస్తువులు నేరుగా ఇంటికే వచ్చేస్తాయి. దీనివల్ల మనం రెండు రకాలుగా లాభపడవచ్చు. డీమార్ట్ లోని ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ ఛార్జీలను కూడా తప్పించుకోవచ్చు. 

Related Articles

Related image1
రెండు, మూడు క్రెడిట్ కార్డులు వాడితే ఏమవుతుందో తెలుసా?
Related image2
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఈ 8 తప్పులు అస్సలు చేయకండి!
34
డీమార్ట్ లో ఆఫర్లు
Image Credit : Asianet News

డీమార్ట్ లో ఆఫర్లు

బియ్యం, పప్పు, నూనె, గృహోపకరణాలు ఇలా ఏవి కొన్నా బయట మార్కెట్‌లతో పోలిస్తే.. డీమార్ట్ లో కాస్త తక్కువ ధరకే లభిస్తాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే అదనపు సౌకర్యం కూడా ఉంది కాబట్టి.. మనం ఇలా కూడా డబ్బును ఆదా చేసుకోవచ్చు. డీమార్ట్ రెడీ యాప్ ను ఓపెన్ చేస్తే.. మనకు కావాల్సిన వస్తువులు వర్గాల వారీగా స్పష్టంగా ఉంటాయి. మనకు కావాల్సిన వస్తువులను ఎంచుకుంటే సరిపోతుంది.

44
షాపింగ్ చేసేటప్పుడు..
Image Credit : Dmart India

షాపింగ్ చేసేటప్పుడు..

డీమార్ట్ రెడీ యాప్ లో షాపింగ్ చేసినప్పుడు డెలివరీ కోసం మనకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుంటే చాలు. మిగతాదంతా డీమార్ట్ బృందం చూసుకుంటుంది. మనం చెప్పిన టైంకి వస్తువులు ఇంటికి వచ్చేస్తాయి. డీమార్ట్ రెడీ యాప్ ద్వారా రోజువారీ అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అయితే డీమార్ట్ రెడీ యాప్ సేవలు ప్రస్తుతం ముంబై, పూణే, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వ్యాపారం
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Related Stories
Recommended image1
రెండు, మూడు క్రెడిట్ కార్డులు వాడితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఈ 8 తప్పులు అస్సలు చేయకండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved