ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఈ 8 తప్పులు అస్సలు చేయకండి!
ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రతీది ఆన్ లైన్ లోనే కొంటున్నారు. కూర్చున్న చోటు నుంచే కావాల్సిన వాటిని ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఇది మంచి సౌకర్యమే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోవాల్సి వస్తుంది

ఆన్ లైన్ షాపింగ్
ఆన్‌లైన్ షాపింగ్ మన జీవితాన్ని సులభతరం చేస్తోంది. కూర్చున్న చోటు నుంచే మనకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. బాగుంటే తీసుకోవచ్చు. లేదంటే తిరిగి పంపించవచ్చు. ఈ కారణంతో చాలామంది ఆన్ లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి సౌకర్యమే అయినప్పటికీ.. మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువే. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆన్ లైన్ షాపింగ్ సురక్షితంగా చేయవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నమ్మకమైన వెబ్‌సైట్
నమ్మకమైన వెబ్ సైట్ లలో షాపింగ్ చేయడం వల్ల మోసపోయే అవకాశం ఉండదు. ఎప్పుడూ ప్రామాణికత కలిగిన, మంచి రివ్యూలు ఉన్న వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే షాపింగ్ చేయాలి.
వెబ్‌సైట్ URL
ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా ఫేక్ వెబ్‌సైట్‌ల ద్వారా జరుగుతాయి. కాబట్టి వెబ్ సైట్ URL ను జాగ్రత్తగా పరిశీలించాలి. నకిలీ వెబ్ సైట్ లు.. అసలు వెబ్‌సైట్‌తో పోలిస్తే కొంచెం తేడాతో ఉండే URLలను ఉపయోగిస్తాయి.
పబ్లిక్ Wi-Fi
పబ్లిక్ Wi-Fi లేదా అన్‌సెక్యూర్ నెట్‌వర్క్ నుంచి అస్సలు ఆన్ లైన్ షాపింగ్ చేయకూడదు. వీటిలో డేటా తేలికగా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్‌నే ఉపయోగించాలి.
పేమెంట్ చేయడానికి..
పేమెంట్ చేయడానికి సురక్షిత పద్ధతులు ఎంచుకోవాలి. డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా యూపీఐ, వాలెట్ వంటి సురక్షిత మార్గాల్లో చెల్లింపులు చేయడం మంచిది.
రివ్యూ, రేటింగ్
ఏ వస్తువును అయినా కొనుగోలు చేసే ముందు దానిపై అంతకు ముందు తీసుకున్న కస్టమర్ల అభిప్రాయాలు, రేటింగులు పరిశీలించాలి. వాటి ఆధారంగా మనం మంచి వస్తువును ఎంపిక చేసుకోవచ్చు.
ఫేక్ ఆఫర్లు
ఫ్రీ గిఫ్టులు, భారీ డిస్కౌంట్ల పేరిట వచ్చే మేసేజ్ లు చాలావరకు మోసపూరితంగానే ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని నమ్మి మన వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదు.
పర్సనల్ ఇన్ఫర్మేషన్
ఎప్పుడైనా సరే.. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్ ల వంటివి ఎవరితో పంచుకోకూడదు. అసలు వెబ్‌సైట్‌లు ఈ వివరాలను ఎప్పుడూ అడగవు.
ఆర్డర్ రసీదులు
ఆర్డర్ కి సంబంధించిన రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. రిటర్న్ లేదా రీప్లేస్ వంటి అవసరాల కోసం ఇవి ఉపయోగపడతాయి.