MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • ఐఫోన్ 16పై దీపావళి ఆఫర్: జెప్టోలో కొంటే మంచి డిస్కౌంట్

ఐఫోన్ 16పై దీపావళి ఆఫర్: జెప్టోలో కొంటే మంచి డిస్కౌంట్

దీపావళికి ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే జెప్టో ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ లో కొంటే మీరు మంచి డిస్కౌంట్ పొందుతారు. ఇది కేవలం దీపావళి పండగ కోసం తీసుకొచ్చిన ఆఫర్. అందువల్ల తక్కువ కాలపరిమితి ఉంటుంది. మీరు ఐఫోన్ 16 కొనాలనుకొంటే వెంటనే జెప్టో వెబ్ సైట్ లోకి వెళ్లి ఫోన్ ఆర్డర్ పెట్టేయండి. డిస్కౌంట్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలకు ఈ స్టోరీ పూర్తిగా చదవండి.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Oct 24 2024, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆపిల్ తాజా స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16 తక్కువ ధరకు అందించేందుకు జెప్టో ఆన్ లైన్ షాపింగ్ యాప్, వెబ్ సైట్ మంచి ఆఫర్లు ప్రకటించింది. దీపావళి పండగను పురస్కరించుకొని వినియోగదారులకు ఆనందం పంచాలని జెప్టో సంస్థ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 

జెప్టో 2021 జులైలో ముంబైలో ప్రారంభమైన కిరాణా సరకులు డోర్ డెలివరీ చేసే సంస్థ. రాకెట్ వేగంతో ఎదిగి మార్కెట్లో సత్తాచాటుతోంది. ముంబై ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న జెప్టో ఒక్క ముంబైలోనే 250 స్టోర్స్ ఉన్నాయి. ఇది దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థ. ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా ఇద్దరూ కలిసి ఈ సంస్థను స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 2024 నాటికి ఈ కంపెనీ విలువ $5 బిలియన్ల కంటే ఎక్కువ. భారతదేశంలోని పది మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 250 డార్క్ స్టోర్‌లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

జెప్టో కంపెనీ అనేది కిరాణా సరకులను డోర్ డెలివరీ చేసే సంస్థ. కరోనా టైమ్ లో ప్రారంభమైన ఈ సంస్థ కేవలం 10 నిమిషాల్లోనే సరకులు ఇంటికి చేరుస్తామని చెప్పింది. చెప్పినట్లుగానే వినియోగదారులకు సకాలంలో సరకులు అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు గ్రోసరీస్ తోపాటు ఇతర సరకులు డెలివరీని చేపట్టింది. దీపావళికి ఇచ్చిన ఆఫర్ ఐఫోన్ 16ని ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఉచితంగా ఇంటికి చేరుస్తామని చెబుతోంది. విజయ్ సేల్స్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా నడుస్తోంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే దాన్ని ఇచ్చి ఐఫోన్ 16పై ఇంకా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.

35

Apple ఇటీవలే iPhone 16 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.79,000 నుంచి రూ.1,10,000 వరకు ఉన్నాయి. సెప్టెంబర్ 10న iPhone 16 సిరీస్ రిలీజ్ అయ్యాయి. ఐఫోన్ 16 సిరీస్‌ విక్రయాలు పెంచేందుకు యాపిల్ ఇండియాలో iPhone పాత మోడళ్లను నిలిపివేసింది.

ఐఫోన్ 16 శక్తివంతమైన A18 చిప్‌తో వస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లకు అనువైన పనితీరు, సామర్థ్యం దీని సొంతం.ఇందులో మాక్రో ఫోటోల కోసం 2x టెలిఫోటో జూమ్, అల్ట్రా వైడ్ లెన్స్‌తో 48 MP ఫ్యూజన్ కెమెరా ఉన్నాయి. 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే అద్భుతమైన విజువల్స్‌ని అందిస్తుంది.

45

ఐఫోన్ 16 మన్నికైనది. నీరు, దుమ్ము నిరోధక డిజైన్‌తో ఐదు రంగుల్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో కొత్తగా చేర్చిన యాక్షన్స్ బటన్ కెమెరా, ఫ్లాష్‌లైట్ వంటి ఫీచర్లను త్వరగా యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని వాడకాన్ని విస్తరించే అప్‌డేట్ ఈ ఏడాది చివర్లో వస్తుందని ఆపిల్ చెప్పింది.

55

iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. సెప్టెంబర్ 10న అఫీషియల్ గా 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ అభిమానులు కొత్త సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. సెప్టెంబర్ 13 నుంచే ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. వినియోగదారుల నుంచి iPhone 16 సిరీస్ ఫోన్ల కోసం ఆర్డర్లు పెరుగుతున్నాని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం
Recommended image2
Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్
Recommended image3
ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టర్నస్ vs సుందర్ పిచాయ్: ఎవరి జీతం ఎక్కువ? మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved