Minimum Balance: ఖాతాదారులకు షాకిచ్చిన బ్యాంక్.. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే కోతే..
DBS Savings Account Minimum Balance Rule: ఖాతాదారులకు ప్రముఖ బ్యాంక్ షాకిచ్చింది. తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే భారీ మొత్తంలో ఫెనాల్టీలు విధిస్తామని తెలిపింది. సగటు నిల్వకు ఒక రూపాయి తగ్గినా మోతే. ఇంతకీ ఆ బ్యాంకు ఏంటో? పూర్తి వివరాలు ..

మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్
డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (DBS) తన ఖాతాదారులకు షాకిచ్చింది. డీబీఎస్ బ్యాంక్ కనీస బ్యాలెన్స్ నిర్వహణకు సంబంధించి ఆగస్టు 1, 2025 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనుంది. ఇకపై కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ మెన్ టైన్ చేయాలని, కనీస బ్యాలెన్స్ లేకపోతే 6% వసూలు చేయనుంది. గరిష్ట జరిమానా ₹500 వరకు ఉంటుంది. అలాగే ఇతర బ్యాంకుల ATMలలో నగదు ఉపసంహరణలపై ఛార్జీలు కూడా పెరగనున్నాయి. ఈ మార్పులు వినియోగదారులపై ఆర్థిక భారం పెంచే అవకాశం ఉంది.
మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి
ఆగస్టు 1, 2025 నుంచి కొత్త ఛార్జీలను అమలు నేపథ్యంలో DBS బ్యాంక్ ఇండియా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలలో కనీస సగటు నిల్వ ₹10,000 ఉండాలని ప్రకటించింది. బ్యాలెన్స్ ఈ పరిమితి కంటే తక్కువగా ఉంటే, ఆ లోటుపై 6% జరిమానా విధించబడుతుంది. ఉదాహరణకు, సగటు బ్యాలెన్స్ ₹8,500 ఉంటే, లోటు ₹1,500, జరిమానా ₹90 అవుతుంది. కస్టమర్లు తమ ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ఈ నిబంధన అమలు చేయబడింది.
కొత్త ఛార్జీలు ఇలా..
సేవింగ్స్ ఖాతా రకాన్ని బట్టి DBS బ్యాంక్ వేర్వేరు కనీస సగటు నిల్వ పరిమితిని నిర్ణయించింది.
- గ్రోత్ వన్ సేవింగ్స్ ఖాతాల మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని రూ. 5,000గా నిర్ణయించింది. ఆ నిల్వ లోటులో 6 శాతం వరకు గరిష్ఠంగా రూ. 250 ఛార్జీ పడుతుంది.
- డీబీఎస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కనీస సగటు నిల్వ రూ. 10,000 గా నిర్ణయించింది. ఈ పరిమితి కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే 6 శాతం వరకు ఫెనాల్టీ వేయవచ్చు. అంటే.. గరిష్ఠంగా రూ. 500 ఉంటుంది.
- గ్రోత్ సేవింగ్స్ ఖాతా కనీస సగటు నిల్వ రూ. 10,000 గా నిర్ణయించగా.. అంతకు తక్కువగా ఉంటే.. 6 శాతం వరకు జరిమానా. గరిష్ఠంగా రూ. 500 వరకు ఛార్జీ చేయవచ్చు.
- లక్ష్మి సేవింగ్స్ యూత్ పవర్ ఖాతా కనీస సగటు నిల్వ రూ. 100 గా నిర్ణయించింది. లోటులో 6 శాతం వరకు గరిష్ఠంగా రూ. 5 వరకు ఉంటుంది.
- TASC సేవింగ్స్ యూత్ పవర్ ఖాతా కనీస సగటు నిల్వ రూ. 10,000 గా నిర్ణయించింది. లోటుపై 6 శాతం ఫెనాల్టీ విధించింది.
ATM లావాదేవీలు
మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ తో పాటు ఆర్భీఐ (RBI) మార్గదర్శకాలను అనుసరించి బ్యాంక్ తన ATM లావాదేవీల ఛార్జీలను కూడా సవరించింది. మే 1, 2025 నుండి డీబీఎస్ బ్యాంక్ నుంచి నెలకు ఐదు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఉచిత పరిమితి దాటిన తరువాత లావాదేవీలపై గరిష్ఠంగా రూ. 23 వరకు వసూలు చేయవచ్చు.
కస్టమర్లకు గమనిక
బ్యాంక్ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. తమ బ్యాలెన్స్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. కనీస బ్యాలెన్స్ నిబంధన, ATM ఛార్జీలలో ఈ మార్పులు నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తమ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఆగస్టు 1, 2025 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రాకముందు కస్టమర్లు తమ మినిమమ్ బ్యాలెన్స్ ను సర్దుబాటు చేసుకోవాలని సూచించబడింది.