ATM: ఏటీఎంలో రోజుకి ఎంత డబ్బు తీసుకోవచ్చు? బ్యాంకుల వారీగా పరిమితులు
ATM: ఏటీఎం నుంచి ఒక రోజులో అన్‌లిమిటెడ్ క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా పరిమితుల గురించి చాలా మందికి తెలియదు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వివరాలు మీ కోసం.

ఏటీఎం క్యాష్ విత్‌డ్రా లిమిట్
ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు ప్రాధాన్యత పెరిగింది. ప్రతి అవసరానికి అన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే.. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా చిన్న లావాదేవీలు, అత్యవసర పరిస్థితులు, లేదా UPI/కార్డ్ చెల్లింపులు అందుబాటులో లేని ప్రదేశాల్లో నగదు అవసరపడుతుంది. చాలా భారతీయ బ్యాంకులు ATM సౌకర్యాలు అందిస్తున్నాయి. అయితే, మీ డెబిట్ కార్డ్ రకం, బ్యాంక్ ఖాతా రకం ఆధారంగా క్యాష్ విత్‌డ్రా లిమిట్స్ ఉంటాయి. అందుకే, మీరు ఉపయోగిస్తున్న ఏటీఎం కార్డ్‌కు డైలీ ఎంత నగదు విత్‌డ్రా లిమిట్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఏటీఎంలో ఎంత తీసుకోవచ్చో తెలుసా?
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల డెబిట్ కార్డుల ఆధారంగా క్యాష్ విత్‌డ్రా లిమిట్స్ ను అమలు చేస్తోంది. మాస్ట్రో, క్లాసిక్ లాంటి బేసిక్ కార్డులు రోజుకు ₹40,000 వరకు మాత్రమే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ప్లాటినం ఇంటర్నేషనల్ వంటి ప్రీమియం కార్డులు ₹1,00,000 వరకూ నగదు విత్‌డ్రా చేయటానికి అనుమతి ఇస్తుంది.
అదేవిధంగా, HDFC బ్యాంక్ కూడా తన వినియోగదారులకు కార్డ్ రకానికి అనుగుణంగా విభిన్న పరిమితులను కల్పిస్తోంది. ఉమెన్స్ అడ్వాంటేజ్, NRO లాంటి బేసిక్ కార్డులకు ₹25,000 లిమిట్ ఉండగా, ఇంపీరియా, ప్లాటినం వంటి ప్రీమియం కార్డులు ₹1,00,000 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. అత్యంత ప్రీమియం కార్డ్ అయిన Jet Privilege World Debit Card ద్వారా రోజుకు ₹3,00,000 వరకూ క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఐసీఐసీఐ, ఆక్సిస్, కోటక్ బ్యాంకుల విత్‌డ్రా లిమిట్స్
ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ వినియోగదారులకు కార్డు ఆధారంగా అనేక నగదు ఉపసంహరణ పరిమితులను విధించింది.
- Coral Plus డెబిట్ కార్డ్ ద్వారా ₹1,50,000,
- Sapphire కార్డ్ ద్వారా ₹2,50,000,
- Smart Shopper Silver కార్డ్ ద్వారా ₹50,000 వరకు నగదు విత్‌డ్రా చేయవచ్చు.
Axis బ్యాంక్ కూడా కార్డు రకం ఆధారంగా పరిమితులు విధించింది.
- RuPay Platinum వంటి బేసిక్ కార్డులకు ₹40,000,
- Burgundy ప్రీమియం కార్డులకు ₹3,00,000 వరకు
కోటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank)లో జూనియర్ కార్డుకు రూ. 5,000 లిమిట్ ఉండగా, ప్రీమియం Privy League Black డెబిట్ కార్డ్ ద్వారా ₹2,50,000 వరకు క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.
వివిధ బ్యాంకుల విత్ డ్రా లిమిట్స్:
- కెనరా బ్యాంక్ కార్డుల ఆధారంగా రూ. 75,000 నుండి రూ. 1,00,000 వరకు రోజూ లావాదేవీలకు అనుమతిస్తుంది.
- యూనియన్ బ్యాంక్ క్లాసిక్ కార్డులకు ₹25,000, బిజినెస్ ప్లాటినం కార్డులకు ₹1,00,000 వరకు పరిమితి ఉంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కార్డులకు టియర్ ఆధారంగా ₹25,000 నుండి ₹1,50,000 వరకు,
- బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కార్డులకు ₹15,000 నుండి ₹1,00,000 వరకు పరిమితి ఉంది.
ఫెడరల్, ఐఓబీ, కర్ణాటక, యెస్ బ్యాంక్ వివరాలు
- ఫెడరల్ బ్యాంక్ కార్డుల ద్వారా ₹2,500 నుండి ₹1,00,000 వరకు క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) కార్డు రకం ఆధారంగా గరిష్టంగా ₹1,00,000 వరకు లావాదేవీలు చేయవచ్చు.
- కర్ణాటక బ్యాంక్ , యెస్ బ్యాంకుల్లో రూ. 10,000 నుండి రూ. 3,00,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీమియం రూపే కార్డు ద్వారా గరిష్టంగా రూ. 2,00,000 వరకు విత్ డ్రా చేయవచ్చు.