కరోనా వైరస్ ఎఫెక్ట్ : ఉద్యోగుల ఏప్రిల్ జీతాలలో కొత.. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు..
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విమానరంగాన్ని ప్రభావితం చేయడం వలన ఏప్రిల్‌లో స్పైస్ జెట్ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల జీతాలను 50 శాతం వరకు నిలిపివేసింది.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం ఇప్పుడు భారతదేశంలోని విమానరంగాన్ని తాకింది. తాజాగా స్పైస్‌జెట్ సంస్థ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల ఏప్రిల్ జీతాలలో కొత్త విధించనుంది. ఈ నేపథ్యంలో పైలట్లు, క్యాబిన్ సిబ్బందితో సహా ఉద్యోగుల ఏప్రిల్ జీతం నుండి 10 నుంచి 50 శాతం వరకు నిలిపివేసినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి

ఛైర్మన్, సిఎండి అజయ్ సింగ్ కూడా తన ఏప్రిల్ జీతం వదులుకొనున్నారు. అలాగే డ్రైవర్ల వంటి జూనియర్ ఉద్యోగులకు ఏప్రిల్‌లో పూర్తి జీతం లభిస్తుందని, స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) అజయ్ సింగ్ ఏప్రిల్‌లో జీతం తీసుకోరని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

క్షీణించిన విమాన ప్రయాణికుల సంఖ్య
కోవిడ్ -19 సెకూండ్ వేవ్ విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కరోనా వ్యాప్తి కారణంగా విమాన ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. తక్కువ వేతనంతో పనిచేసే ఉద్యోగులకు జీతంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని వారికి పూర్తి వేతనం ఇవ్వబడుతుందని విమానయాన సంస్థ స్పష్టం చేసింది.

స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ, ' స్పైస్‌జెట్ సిఎండి కూడా తన జీతం మొత్తాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది తాత్కాలిక చర్య మాత్రమే, పరిస్థితి పూర్తిగా సాధారణమైన తర్వాత కంపెనీ నిలిపివేసిన జీతం తిరిగి చెల్లించబడుతుంది. ' అని తెలిపారు.

చాలా దేశాలు విమానాలను నిషేధించాయి
దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశం నుండి ప్రయాణించే అన్ని విమానాలను నిషేధించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, యుఎఇ, హాంకాంగ్, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాలు వారి పౌరులకు ఇండియాకి ప్రయాణించవద్దని సూచించాయి. అలాగే ప్రస్తుతం భారతదేశం వెళ్ళడం లేదా అక్కడి నుండి ప్రయాణించడం చేయవద్దని ఆ దేశ ప్రజలకు సూచించాయి.

మే 31 వరకు దేశ విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచలేవని సంగతి మీకు తెలిసిందే. అలాగే దేశీయ విమానాల ఛార్జీల పరిమితి మే 31 వరకు కొనసాగుతుందని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారీ వ్యయం నుండి ప్రయాణికులకు ఉపశమనం అందించేందుకు విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానయాన సంస్థలపై క్యాప్ విధించింది.