Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Car Tire Inflation: కారు టైర్లకు నార్మల్ గాలి మంచిదా? నైట్రోజన్ మంచిదా?

Car Tire Inflation: కారు టైర్లకు నార్మల్ గాలి మంచిదా? నైట్రోజన్ మంచిదా?

Car Tire Inflation: కారు టైర్లలో నైట్రోజన్‌ను నింపితే మంచిదని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది కదా.. అందుకే చాలా పెట్రోల్ బంకుల్లో కూడా నార్మల్ గాలితో పాటు నైట్రోజన్ కూడా నింపుతున్నారు. అయితే కారు టైర్లలో సాధారణ గాలిని ఉపయోగించాలా లేదా నైట్రోజన్‌ను ఉపయోగించాలా అని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం. 

Naga Surya Phani Kumar | Published : Mar 08 2025, 11:30 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

మీకు తెలుసా? కారు టైర్లలో నింపే సాధారణ గాలిలో కూడా నైట్రోజన్‌ శాతం ఎక్కువగానే ఉంటుంది. సాధారణ గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, తక్కువ మొత్తంలో ఇతర వాయువులు ఉంటాయి. కారు టైరులో నైట్రోజన్ నింపితే అందులో దాదాపు 93% నుంచి 99% స్వచ్ఛమైన నైట్రోజన్‌ ఉంటుంది. 

25
Asianet Image

కారు టైర్లలో ఏ గాలి నింపాలన్నది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా ఖర్చు. సాధారణ గాలి నింపాలంటే రూ.5, రూ.10 ఇస్తే సరిపోతుంది. అదే నైట్రోజన్ నింపాలంటే రూ.30 నుంచి రూ.50 వరకు తీసుకుంటారు. అయితే ఒక్కసారి టైర్లలో నైట్రోజన్ నింపితే ఎక్కువ కాలం ప్రెషర్ ని పట్టి ఉంచుతుంది. సాధారణ గాలి అయితే తగ్గిపోతుంది. అందుకే తరచూ గాలి కొట్టించాల్సి వస్తుంది. 

టైర్లలో సాధారణ గాలి నింపినప్పుడు అందులో ఉండే ఆక్సిజన్ అణువులు చిన్నవిగా ఉండటం వల్ల అవి టైర్ల నుండి వేగంగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని కారణంగా తరచుగా టైర్ల ప్రెజర్ చెక్ చేస్తూ, అవసరమైతే నింపాల్సి ఉంటుంది.

35
Asianet Image

కారు టైర్లలో నైట్రోజన్ నింపితే దాని పెద్ద అణువు పరిమాణం కారణంగా టైర్ లో ప్రెజర్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఇది గాలి లీకేజీని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇంధన సామర్థ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. టైర్ తరుగుదల కూడా సమానంగా ఉండేలా సహకరిస్తుంది. టైర్లలో నైట్రోజన్ నింపితే టైర్ల జీవితకాలం పెరుగుతుంది. నైట్రోజన్‌లో తేమ ఉండదు కాబట్టి చక్రాలలో తుప్పు పట్టదు. అందువల్ల లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి, బరువైన వాహనాలకు నైట్రోజన్ అయితే మంచిది. 

45
Asianet Image

కార్ల టైర్లలో సాధారణ గాలి నింపితే తరచూ గాలి తగ్గిపోవడం జరుగుతుంది. సాధారణ గాలిలో ఉండే తేమ వల్ల కొంత కాలానికి చక్రాల అంచుల లోపల తుప్పు పడుతుంది. అయితే రోజూ ప్రయాణించే వారికి, టైర్లను క్రమం తప్పకుండా చూసుకునే వారికి, వాహనాలను శ్రద్ధగా మెయింటెయిన్ చేసేవారికి సాధారణ గాలి అయితేనే బెటర్. ఖర్చు కూడా తగ్గుతుంది. 

55
Asianet Image

టైర్లలో ఏ గాలి నింపితే మంచిది? 

కారు టైర్లలో రెండూ బాగానే పనిచేస్తాయి. అయితే నైట్రోజన్‌ వల్ల కాస్త ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయ. అయిన్నప్పటికీ వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, శ్రద్ధగా చూసుకొనే వారికి సాధారణ గాలి ఉపయోగించడం మంచిది.

నైట్రోజన్ ఎక్కువ కాలం ప్రెజర్ ని పట్టి ఉంచుతుంది. దీని వల్ల టైర్లు పెద్దగా దెబ్బతినవు.  అయితే నైట్రోజన్ గ్యాస్ నింపాల్సిన ప్రతి సారి డబ్బులు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 

ఇది కూడా చదవండి ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories