MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Car Prices: వామ్మో.. అన్ని కార్ల కంపెనీలు ధరలు పెంచేశాయి. ఇక కారు కొనడం కష్టమేనా?

Car Prices: వామ్మో.. అన్ని కార్ల కంపెనీలు ధరలు పెంచేశాయి. ఇక కారు కొనడం కష్టమేనా?

Car Prices: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు కొనాలంటే మీ జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ 1, 2025 నుండి తమ కార్ల ధరలను పెంచేశాయి. ఏ కార్లు ఎంతెంత పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 02 2025, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2024-2025 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా భారతదేశంలోని చాలా ప్రముఖ కార్ల కంపెనీలు ధరలు పెంచాయి. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ద్రవ్యోల్బణం ఈ చర్యకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని కంపెనీలు గత కొన్ని నెలల్లోనే రెండు, మూడు సార్లు కార్ల ధరలు పెంచాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మారుతి సుజుకి

మారుతి సుజుకి దాని కార్ల మోడల్స్ పై 4 శాతం వరకు ధరలు పెంచేసింది. ఆల్టో కె10, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ఈ లిస్టులో ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి వీటి ధరలు మారతాయి. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ప్రొడక్షన్ ఖర్చులను బ్యాలెన్స్ చేయడానికే ఇలా చేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. 

36

టాటా మోటార్స్

టాటా మోటార్స్ కూడా వివిధ మోడల్స్ ధరలు పెంచేసింది. ఈ పెరుగుదల సుమారు 3 శాతం వరకు ఉంటుంది. నెక్సాన్, టియాగో, కర్వ్ వంటి అనేక మోడళ్లు ఈ లిస్టులో ఉన్నాయి. ఈ కార్ల ఎలక్ట్రిక్ వెర్షన్‌ల ధరలు కూడా పెరిగిపోయాయి. టాటా మోటార్స్ EV కార్లకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రొడక్షన్ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకుంటూ లాభాలను కాపాడుకోవడానికి ధరలను పెంచడం, తగ్గడం చేస్తుంటామని టాటా మోటార్స్ ప్రకటించింది. 

46

మహీంద్రా

స్ట్రాంగ్ SUV మోడల్స్ ని అందించే మహీంద్రా కూడా 3 శాతం వరకు ధరలను పెంచింది. స్కార్పియో ఎన్, థార్ రాక్స్, ఎక్స్‌యువి 700 వంటి మోడల్స్ ఈ లిస్టులో ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో ఎక్కువ కార్లు తయారు చేయాల్సి రావడంతో ప్రొడక్షన్, సప్లై ఖర్చులను బ్యాలెన్స్ చేయడం కోసం ధరలు పెంచాల్సి వచ్చిందని మహీంద్రా పేర్కొంది.

56

కియా, హ్యుందాయ్

కియా, హ్యుందాయ్ రెండూ కూడా ఒక్కొక్కటి 3 శాతం వరకు ధరల పెరుగుదలను ప్రకటించాయి. కియా సోనెట్, సెల్టోస్, కేరెన్స్ ధరలు పెరిగిన లిస్టులో ఉన్నాయి. హ్యుందాయ్ కు చెందిన క్రెటా, ఎక్స్‌టర్, గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడల్స్ ధరలు పెరిగిన జాబితాలో ఉన్నాయి. ఆర్థిక ఒడిదుడుకుల మధ్య లాభాలను నిలుపుకోవడానికి ఈ రెండు కంపెనీలు ధరలు పెంచుతూ, తగ్గిస్తూ లాభాల కోసం ప్రయత్నిస్తున్నాయి. 

66

హోండా, రెనాల్ట్

హోండా, రెనాల్ట్ వంటి ఇతర కార్ల కంపెనీలు కూడా ధరల పెరుగుదలను ప్రకటించాయి. రెనాల్ట్ దాని మోడల్స్ పై 2 శాతం పెరుగుదలను ధృవీకరించింది. హోండా ఇంకా కచ్చితమైన శాతం పెరుగుదలను ప్రకటించలేదు.

కొత్తగా కార్లు కొనాలనుకొనే వారు వాటి మోడల్స్ ను బట్టి ధరలు తెలుసుకొని కొనుక్కోవడం మంచిది. 

ఇది కూడా చదవండి హోండా అమేజ్ vs టాటా టిగోర్: ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
స్టాక్ మార్కెట్
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved