రూ. 78 వేల 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ కేవలం 30 వేలకే.. వెంటనే కొనేయండి.
ఈ కామర్స్ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించే క్రమంలో రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మంచి డీల్స్‌ను అందిస్తోంది. రిపబ్లిక్ డే సేల్ ముగిసిన తర్వాత కూడా ఓ టీవీపై మంచి డీల్ లభిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Smart TV
55 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలంటే కచ్చితంగా కనీసం రూ. 50 వేలు అయినా ఖర్చు చేయాల్సిందే. అయితే అమెజాన్‌లో కేవలం రూ. 30 వేలకే 55 ఇంచెస్ టీవీ లభిస్తోంది. టీసీఎల్ కంపెనీకి చెందిన ఈ టీవీపై అమెజాన్‌లో ఏకంగా 59 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలి.? ఈ టీవీలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.
Smart TV
టీసీఎల్ 55 ఇంచెస్ మెటాలిక్ బెజల్ లెస్ 4కే అల్ట్రాహెచ్‌డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ అసలు ధర రూ. 77,990 కాగా అమెజాన్‌లో 59 శాతం డిస్కౌంట్‌తో రూ. 31,990కి లభిస్తోంది. అయితే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో ఈ టీవీని కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 30 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇంత తక్కువ ధరలో 55 ఇంచెస్ లభించడం అంటే బెస్ట్ డీల్‌గానే చెప్పొచ్చు.
Smart TV
ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3కే రిజల్యూషన్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఎల్‌ఈడీ ప్యానెల్‌ను అందించారు. 4కే అల్ట్రాహెచ్‌డీ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో 3 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్స్, ఇథర్‌నెట్, హెచ్‌డీఎమై పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. ఇక 24 వాట్స్ అవుట్‌పుట్ డాల్బీ ఆడియో ఈ టీవీ సొంతం. ఈ టీవీపై 2 ఏళ్ల వారంటీని అందించారు.
Smart TV
ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, యూట్యూబ్, జియో సినిమా, వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా టీవీలో వస్తాయి. ఇక ఈ టీవీలో ఏఐపీ2 ప్రాసెసర్‌ను అందించారు. అదే విధంగా డైనమిక్ కాలర్ ఎన్‌హాన్స్‌మెంట్, మల్టీ ఐ కేర్ వంటి ఫీచర్లను అందించారు. టీ స్క్రీన్ పేరుతో ఇందులో ప్రత్యేక టెక్నాలజీని అందించారు. ఈ టీవీలో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీని ఇచ్చారు. ఇంటెలిజెంట్ సౌండ్ మోడ్, డాల్బీ ఆడియో వంటివి ఈ టీవీలో అదనంగా అందించిన ఫీచర్లుగా చెప్పొచ్చు.