- Home
- Business
- Business Ideas: ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, కేవలం స్మార్ట్ ఫోన్ తో ఒక గంట పనిచేస్తే చాలు లక్షల ఆదాయం..
Business Ideas: ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, కేవలం స్మార్ట్ ఫోన్ తో ఒక గంట పనిచేస్తే చాలు లక్షల ఆదాయం..
Business Ideas: డబ్బు సంపాదించడమే మీ లక్ష్యమా, అయితే కాదు ఏది వ్యాపారానికి అనర్హం అనేది కొత్త సూత్రం, వ్యాపారం కోసం పెట్టుబడి కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ పెట్టుబడి కన్నా ముందు మీకు ఆలోచన చాలా ముఖ్యం. ఇందుకోసం ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి. మీరు చేసే వ్యాపారంలో అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఎడ్యుకేషన్ వ్యాపారం కాకపోయినా, ఉపాధి అవకాశం అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో విద్యార్థులు చదువును తమ కెరీర్ కు సాధనంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు టీచర్, లేదా ఒక సబ్జెక్టులో నిష్ణాతులు అయితే కచ్చితంగా చక్కటి ఆదాయాన్ని పొందే వీలుంది. ప్రస్తుత కాలంలో డిజిటల్ యుగం కావునా, ఆన్ లైన్ క్లాసెస్ అనేవి చక్కటి ఆదాయ అవకాశం అనే చెప్పాలి. ఎందుకుంటే ఆన్ లైన్ ద్వారా మీరు ఒక ప్రాంతంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పరిచయం అవుతారు.
ఇందుకోసం మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. మీ రోజు వారీ సమయంలో కేవలం ఒక గంట నుంచి రెండు గంటలు కేటాయిస్తే చాలు. యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందవచ్చు. ఆన్ లైన్ క్లాస్ రూం ఏర్పాటు కోసం మీరు ఒక వైట్ బోర్డ్, మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇక ఎడిటింగ్ కోసం మీకు కంప్యూటర్ కూడా అవసరం లేదు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో బోలెడు ఆన్ లైన్ ఎడిటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక ఏ సబ్జెక్ట్ చెప్పాలి అని మీరు అనుకోవచ్చు. నిజానికి స్పోకెన్ ఇంగ్లీషు తరగతులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మన దేశంతో పాటు పలు ఆగ్నేయాసియా దేశాల్లో ప్రజలు ఇంగ్లీషు నేర్చుకోవాలని ఆన్ లైన్ క్లాసెస్ ను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారు మీ క్లాసెస్ చూస్తారు. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు సైతం ఆన్ లైన్ క్లాసెస్ చూస్తుంటారు. వారి కోసం కూడా మీరు సబ్జెక్ట్ వారీగా రికార్డ్ చేసి యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేయాలి.
ఇక యూట్యూబ్, ఫేస్ బుక్ ఈ రెండు ప్లాట్ ఫామ్ ల ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఇందులో వ్యూస్ పరంగా మీరు సంపాదించుకునే వీలుంటుంది. అయితే ఈ వీడియోలు ఎవరు చూస్తారులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ వీడియోలు వైరల్ కాకపోయినా, నెమ్మదిగా ఏళ్ల తరబడి విద్యార్థులు చూస్తుంటారు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది పాతబడదు. సెర్చ్ ఇంజన్ ద్వారా మీ టాపిక్ వెతుక్కొని మీ వీడియోలను వీక్షిస్తుంటారు. తద్వారా మీకు నిరంతరం ఆదాయం లభించే అవకాశం ఉంది.
ఇక మీరు ఒక యాప్ సృష్టించి దాని ద్వారా కూడా మీరు మీ వీడియోలను పబ్లిష్ చేయవచ్చు. తద్వారా కూడా మీ యూట్యూబ్ వీడియోలకు ప్రచారం కల్పించవచ్చు. ఇలా మీరు ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది.