Business Ideas: నిరుద్యోగులు మీ సొంత ఊరిలోనే నెలకు రూ. 2 లక్షల వరకూ సంపాదించే చాన్స్, చాలా ఈజీగా సంపాదించవచ్చు
నిరుద్యోగులారా వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఓ చక్కటి వ్యాపార ఐడియాతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల 50 వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర రుణాల ద్వారా యువతను ఉపాధి వైపు ప్రోత్సహిస్తోంది మీరు కూడా ముద్ర రుణాల ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకు వద్దకు వెళ్లి ముద్ర రుణాల కోసం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇందుకోసం మీరు ఎలాంటి తనకా పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మీ ప్రాజెక్టు రిపోర్టును సబ్మిట్ చేయడం ద్వారా మీరు రుణం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు ప్రతి నెల కొద్ది మొత్తంలో ఈఎంఐ పద్ధతిలో చెల్లించుకుంటే సరిపోతుంది.
ముద్ర రుణాలను 50 వేల రూపాయల నుంచి పది లక్షల వరకు పొందవచ్చు మీరు కూడా ముద్రా రుణాల ద్వారా వ్యాపారం చేయాలి అనుకుంటే సమీపంలోని ప్రభుత్వ బ్యాంకు మేనేజర్ ను సంప్రదిస్తే సరిపోతుంది. ఇప్పుడు ముద్ర రుణం పొందిన అనంతరం ఏ వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఫ్రాంచేసి బిజినెస్ ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా అలాంటి ఫ్రాంచేసి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే బిర్యాని ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రెడ్ బకెట్ బిర్యానీ చాలా ఫేమస్ అయ్యింది. వీరు ప్రత్యేకమైనటువంటి మసాలాలను రూపొందించి తమ ఫ్రాంచైజీలకు సప్లై చేస్తున్నారు.
రెడ్ బకెట్ బిర్యానీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మంచి బేస్ కస్టమర్ ఏర్పడింది. అందుకే మీరు కొత్తగా బిర్యాని సెంటర్ ప్రారంభించాలి అనుకుంటే ఇలాంటి ఫ్రాంచైజీ రూపంలో బిర్యానీ సెంటర్ ప్రారంభిస్తే మీకు బ్రాండ్ ఇమేజ్ కూడా దక్కే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో సైతం ఈ రెడ్ బకెట్ బిర్యానీ అవుట్లెట్స్ పెద్ద ఎత్తున ప్రారంభం అవుతున్నాయి.
మీరు కూడా ఈ ఫ్రాంచేసి పొందాలని అనుకున్నట్లయితే రెడ్ బకెట్ బిర్యానీ వారి వెబ్సైట్లోకి వెళ్లి ఫ్రాంచేసి విభాగంలో వారిని సంప్రదిస్తే సరిపోతుంది. అంతేకాదు సదరు ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా మీరు స్టోర్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో కూడా వారే సలహా ఇస్తారు. మీరు ప్రతిరోజు చేయాల్సిన బిరియాని కూడా ఎలా వండాలో మీకు శిక్షణ ఇస్తారు. అలాగే మీకు కావాల్సిన మసాలాలు కూడా కంపెనీవారే పంపుతారు.
రెడ్ బకెట్ బిర్యానీ తో పాటు ప్రస్తుతం మార్కెట్లో ఇతర సంస్థలు సైతం ఇలాంటి ఫ్రాంచైజీ ఆఫర్లను అందిస్తున్నాయి. మీకు నచ్చిన ఫ్రాంచేసిని ఎంపిక చేసుకొని వ్యాపారం ప్రారంభించడం ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది బిర్యాని సెంటర్ బాగా నడిచినట్లైతే ప్రతినెలా ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు మిగిలిన అవకాశం ఉంటుంది.