MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే..ఆర్గానిక్ థాలీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోండి

Business Ideas: సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే..ఆర్గానిక్ థాలీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోండి

వ్యాపారం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫుడ్ బిజినెస్ మాత్రమే కానీ, ఇందులో వచ్చినంత లాభం మరే ఇతర బిజినెస్ మోడల్ లో రాదు అంటే అతిశయోక్తి కాదు. నిజమే ఫుడ్ బిజినెస్ లో క్లిక్ అయితే ప్రతి రోజు ఆదాయం లభిస్తుంది. అయితే కాస్త వినూత్నంగా ఆలోచిస్తే మీకు చక్కటి ఆదాయ మార్గంగా నిలుస్తుంది. అలాంటి ఆదాయ మార్గం గురించి తెలుసుకుందాం. ఆర్గానిక్ థాలీ బిజినెస్ ద్వారా మీరు మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.  

2 Min read
Author : Krishna Adhitya
Published : Aug 19 2022, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ మద్య కాలంలో బయటి ఫుడ్ కన్నా కూడా హోమ్లీ ఫుడ్ పైనే అందరి దృష్టి పడింది. ముఖ్యంగా ఆరోగ్యం పాడవకుండా తక్కువ మసాలాలు, కారం, నాణ్యమైన నూనెలు వాడి చేసే వంటలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ముఖ్యంగా ఈ కాలంలో ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల జనం తమ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. అలాంటి వారికోసమే, ఆర్గానిక్ థాలీ భోజనం. ఈ బిజినెస్ ను మీరు డోర్ డెలివరీ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫుడ్ డెలివరీ యాప్స్ తో టైఅప్ అవ్వడం మేలు. లేదా నిర్ణీత కస్టమర్లను మాత్రమే పెట్టుకొని వారికి మాత్రమే మంత్లీ చార్జ్ వసూలు చేసుకొని సర్వీసు అందిస్తే సరిపోతుంది. 
 

26

ఆర్గానిక్ థాలీ కోసం మీరు చేయాల్సింది. ముందుగా  ఒక విశాలమైన గదిని ఏర్పాటు చేసుకొని అందులో కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం నగరంలోనే ఒక కమర్షియల్ లేదా, 100 గజాల స్థలంలో గదిని కట్టుకొని ఏర్పాటు చేసుకోవాలి. కరెంట్, వాటర్ సప్లై తప్పనిసరిగా ఉంచుకోవాలి. 
 

36

ఈ ఆర్గానిక్ థాలీ కోసం మెనూ సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా వెజ్, నాన్ వెజ్ థాలీలను సప్లై చేయాలి. వంట సామాగ్రి కోసం ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి రైతుల నుంచి కూరగాయలు, బియ్యం, పాలు, పెరుగు, సేకరించాలి. అలాగే వంటనూనెల విషయంలో కూడా ఆర్గానిక్ నూనెలు వాడాల్సి ఉంటుంది. అప్పుడే కస్టమర్లకు నమ్మకం కలుగుతుంది. ఆర్గానిక్ ఫుడ్ కోసం కస్టమర్లు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. 
 

46

ఇక ఆర్గానిక్ థాలీ కస్టమర్ల కోసం మీరు పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వార్తా పత్రికలు, సోషల్ మీడియా, అలాగే ఆఫీసులు, విద్యా సంస్థలు, ఇతర వ్యాపార సముదాయాల్లో కరపత్రాల ద్వారా మీ బ్రాండ్ ను తెలియ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 100 మంది కస్టమర్ల నుంచి మంత్లీ సబ్ స్క్రిప్షన్ ప్రాతిపదికన ముందుగానే పేమెంట్ తీసుకొని వారికి డిస్కౌంట్ ఇవ్వొచ్చు. అప్పుడు ఆ వంద మంది కస్టమర్లు మీకు రెగ్యులర్ అవుతారు. వారికి డెలివరీ చేయడం ద్వారా మధ్యాహ్నం లంచ్ అందించాలి. ఇందుకోసం డెలివరీ బాయ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. 
 

56

ఇక స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా ఆర్డర్స్ తీసుకోవడం ద్వారా మీకు డెలివరీ చేసుకునే భారం తప్పుతుంది. కొంత మంది సీనియర్ సిటిజన్స్ సైతం ఈ తరహా థాలీని తినేందుకు ఇష్టపడుతున్నారు. ఐటీ కంపెనీలు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య కేంద్రాల్లో పనిచేసే వారు మీ టార్గెట్ కస్టమర్లుగా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆన్ టైం డెలివరీ, అత్యాశకు పోయి ఎక్కువ మంది నుంచి మంత్లీ సబ్ స్క్రయిబర్లను తీసుకోవద్దు. మీరు ఎంత మందికి డెలివరీ చేయగలరో అంతమంది కస్టమర్లనే తీసుకోండి. రుచి,నాణ్యత, ప్యాకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దు. 

66

సరుకులు, అద్దె, చార్జీలు, జీతాల వంటి ఖర్చులు పోనూ, మీకు ఎంత లాభంతో మార్జిన్ ఉంటే వర్కౌట్ అవుతుందో అంతే తీసుకోండి. కస్టమర్లు పెరిగితే మీ ఆదాయం పెరుగుతుంది.     

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Vacant Plot Income: ఇంటి స్థలం ఖాళీగా ఉందా? వీటిని పండిస్తే ఆదాయం గ్యారెంటీ
Recommended image2
Business Ideas: ఇంట్లోనే ఉంటూ పైసా పెట్టుబడి లేకుండా.. నెలకు రూ. 2 లక్షలు ఇలా సంపాదించవచ్చు..
Recommended image3
Today Gold Rate In Hyderabad: కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్..గ్రాము ఎంత తగ్గిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved