- Home
- Business
- Business Ideas: కేవలం ఒక మిషిన్ కొనుగోలు చేస్తే చాలు, మహిళలు ఇంటివద్దే నెలకు రూ.50 వేలు సంపాదించే బిజినెస్ ఇదే
Business Ideas: కేవలం ఒక మిషిన్ కొనుగోలు చేస్తే చాలు, మహిళలు ఇంటివద్దే నెలకు రూ.50 వేలు సంపాదించే బిజినెస్ ఇదే
మహిళలు బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే ఇంటి వద్ద ఉంది చేయగలిగే మంచి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. . మీ ఖాళీ సమయానికి ఉపయోగించుకొని చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది ఎందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు కేవలం ఒక యంత్రం కొనుగోలు చేయడం ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ బిజినెస్ గురించి తెలుసుకుందాం.

paper plate business
మీరు కేవలం ఒక యంత్రం కొనుగోలు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందాలని ఆలోచిస్తున్నారా అయితే పేపర్ ప్లేట్స్ తయారీ ఒక చక్కటి మార్గం అనే చెప్పాలి . పేపర్ ప్లేట్స్ తయారీకి కేవలం ఒక యంత్రం కొనుగోలు చేస్తే సరిపోతుంది తద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రస్తుతం నిరుద్యోగులు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునేందుకు ముద్ర రుణాలను అందజేస్తుంది దీని కింద మీరు 50 వేల నుంచి 10 లక్షల వరకు రుణాలను పొందే వీలుంది ఇప్పుడు పేపర్ ప్లేట్ బిజినెస్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
పేపర్ ప్లేట్ తయారీ యంత్రం ఆన్ లైౌన్లో సైతం కొనుగోలు చేయవచ్చు. పేపర్ ప్లేట్ తయారీ యంత్రం ధర ఇండియా మార్ట్ వెబ్సైట్ ప్రకారం 60 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉంది ఇందులో యంత్రం సామర్థ్యాన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ప్రాతిపదికన ఈ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
పెళ్లిళ్లు బఫెలో పేపర్ ప్లేట్లు వాడకం ఎక్కువగా ఉంది అయితే, అయితే ఇందులో చాలామంది నష్టపోతామని అంటుంటారు. కానీ సరైన మేనేజ్మెంట్ చేస్తే మాత్రం పేపర్ ప్లేట్ల వ్యాపారం కూడా చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. పని వాళ్ళ పై ఆధారపడకుండా మీరే సొంతంగా పేపర్ ప్లేట్లను తయారు చేసుకుంటే కూలీ డబ్బులు కలిసి వస్తాయి. అంతేకాదు పేపర్ ప్లేట్స్ మార్కెటింగ్ కూడా మీరు నేరుగా చేసుకోవడం వల్ల లాభం పొందే అవకాశం ఉంది. మెటీరియల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మహిళలు కొంతమంది గ్రూప్ గా చేరి, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే మీరు క్యాటరింగ్ సర్వీసులు, మెస్సులు హోటళ్లను నేరుగా సంప్రదించి మార్కెట్ ధర కంటే కొద్దిగా తక్కువకే ప్లేట్లను సప్లై చేస్తామంటే మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే పేపర్ ప్లేట్ల విషయంలో మెషిన్ మెయింటెనెన్స్ చాలా అవసరం. విద్యుత్ బిల్లులు ఎక్కువగా రాకుండా ఉండేందుకు మిషన్ మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి చిన్న చిన్న రిపేర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంట వెంటనే రిపేర్లు చేయిస్తూ ఉండాలి అప్పుడే మీరు పెద్ద మొత్తంలో నష్టపోకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది.
ఇక పేపర్ ప్లేట్ బిజినెస్ విషయంలో నష్టం రాకుండా ఉండాలంటే మార్కెటింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్డర్లను నిరంతరం పొందేలా ప్లాన్ చేసుకోవాలి అప్పుడే ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.