- Home
- Business
- Business Ideas: షాపుతో పనిలేదు ఇంటి వద్ద ఉండే నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించ గలిగే బిజినెస్ ఇదే..
Business Ideas: షాపుతో పనిలేదు ఇంటి వద్ద ఉండే నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించ గలిగే బిజినెస్ ఇదే..
వ్యాపారం కోసం మీరు ప్లాన్ చేస్తున్నారా, అయితే ఓ చక్కటి వ్యాపార అవకాశం గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా ప్రతినెలా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు ఇంటి వద్దనే ఉండి ఈ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. అలాంటి బిజినెస్ ఏంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలో కూడా తెలుసుకుందాం.

ప్రస్తుతం కార్లు కొనడం అనేది చాలా సాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరూ కార్లను కొనుగోలు చేస్తున్నారు ముఖ్యంగా ఒకప్పుడు లగ్జరీగా ఉన్న కారు ఇప్పుడు సాధారణం అయిపోయింది. అయితే కార్లను శుభ్రం చేయడం ద్వారా చక్కటి వ్యాపారం చేసే అవకాశం ఉంది మీరు కూడా అలాంటి వ్యాపార అవకాశం కోసం చూస్తున్నట్లయితే ప్రస్తుతం, డొమెస్టిక్ కార్ క్లీనింగ్ ఓ చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం
కార్ క్లీనింగ్ అనేది ప్రతి ఒక్కరూ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కార్ క్లీనింగ్ కోసము సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. కార్ క్లీనింగ్ సర్వీసింగ్ సెంటర్ల వద్దకు వెయిట్ చేయాల్సి వస్తోంది. అలాగే డబ్బు కూడా అధికంగా ఖర్చు చేయాల్సి ఉంది. దీన్నే మీరు వ్యాపార అవకాశం గా మార్చుకొని ఇంటి వద్దనే కార్ క్లీనింగ్ చేసినట్లయితే మీకు చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. అలాంటి వ్యాపార అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కార్ క్లీనింగ్ కోసం మీరు ఉపయోగించే మెషిన్ ఆన్ లైన్ లో లభిస్తోంది. దీని ధర సుమారు 20 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. దీన్ని కొనుగోలు చేయడం ద్వారా మీరు కారు క్లీనింగ్ సర్వీసును త్వరగా ప్రారంభించే అవకాశం ఉంది. కార్ క్లీనింగ్ కోసం మీరు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు షాపు కూడా అవసరం లేదు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి ఆర్డర్లు తీసుకొని కారు క్లీనింగ్ చేయవచ్చు. ఇందుకోసం మీరు ఒక ఫోన్ నెంబర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సోషల్ మీడియాను ఉపయోగించి కూడా మీరు అందించే సర్వీస్ ను ప్రచారం చేసే వీలుంది.
కార్ క్లీనింగ్ కోసం క్లైంట్ వద్దకు వెళ్లేందుకు ఒక మారుతీ వ్యాన్ లేదా ఒక కమర్షియల్ వెహికల్ ను కొనుగోలు చేసుకుంటే మంచిది. తద్వారా మీరు క్లైంట్ వద్దకు వెళ్లి వారి కారును సులభంగా క్లీన్ చేయవచ్చు. మీరు ఎన్ని ఆర్డర్లను పొందితే అంత లాభం మీకు వస్తుంది. కార్ క్లీనింగ్ ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే నగరాల్లో పెద్ద ఎత్తున కార్లను జనం కొనుగోలు చేస్తున్నారు. వాటిని క్లీనింగ్ చేసే సమయం వారికి ఉండదు కావున మీరు దీన్ని వ్యాపార అవకాశం గా మలుచుకొని ఇంటి వద్ద నుంచే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
పెద్ద ఎత్తున మీరు కార్ క్లీనింగ్ సర్వీసును ప్రారంభించాలి అనుకుంటే జిఎస్టి నెంబర్ తీసుకోవడం అత్యుత్తమమైన పని అలాగే మీ కంపెనీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి తద్వారా భవిష్యత్తులోప్రాబ్లం రాకుండా ఉంటుంది.