MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Business Idea: ఇదే స‌రైన స‌మ‌యం.. ఈ బిజినెస్‌తో ఇల్లు క‌ద‌ల‌కుండా నెల‌కు వేలల్లో ఆదాయం ఖాయం

Business Idea: ఇదే స‌రైన స‌మ‌యం.. ఈ బిజినెస్‌తో ఇల్లు క‌ద‌ల‌కుండా నెల‌కు వేలల్లో ఆదాయం ఖాయం

Business Idea: ఇంట్లో నుంచే ప్రారంభించే వ్యాపారాల్లో పచ్చళ్ల తయారీ ఒకటి. తక్కువ పెట్టుబడి, సులభమైన ప్రాసెస్‌, స్థిరమైన డిమాండ్‌ ఈ బిజినెస్‌కు బలం. సరైన ప్లానింగ్‌తో చేస్తే ఇది చిన్న స్థాయి నుంచి పెద్ద బ్రాండ్‌గా మారే అవకాశం కూడా ఉంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 05 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పచ్చళ్ల వ్యాపారం ఎందుకు బెస్ట్ ఆప్షన్?
Image Credit : Gemini AI

పచ్చళ్ల వ్యాపారం ఎందుకు బెస్ట్ ఆప్షన్?

భారతీయ ఆహారంలో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఇంట్లో రోజూ ఉపయోగించేది కావడంతో డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదు. ముఖ్యంగా వేసవిలో మామిడికాయ పచ్చళ్లు, అలాగే చికెన్‌, ఫిష్‌ పచ్చళ్లకు కూడా మంచి మార్కెట్ ఉంది. ఇంట్లో తయారైనవి ఆరోగ్యకరంగా ఉంటాయని భావనతో కస్టమర్లు హోమ్‌మేడ్ ప్రోడక్ట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ప్ర‌స్తుతం మారిన జీవ‌న విధానం, వ‌ర్క్ క‌ల్చ‌ర్‌తో ఇంట్లో ప‌చ్చ‌ళ్లు త‌యారు చేసుకునే వారి సంఖ్య త‌గ్గుతోంది. దీంతో ప‌చ్చ‌ళ్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం?
Image Credit : Gemini AI

ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం?

పచ్చళ్ల వ్యాపారం చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే సుమారు రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు పెట్టుబడి సరిపోతుంది. ఈ పెట్టుబడిలో ప్ర‌ధానంగా ఉండే ఖ‌ర్చుల విష‌యానికొస్తే.. మామిడికాయలు లేదా ఇతర కూరగాయలు, నూనె, మసాలాలు, జార్లు, కంటైనర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్, లేబుల్స్, బ్రాండింగ్ వంటివి కావాల్సి ఉంటుంది. మొదట చిన్న పరిమాణంలో తయారు చేసి.. అమ్మకం పెరిగే కొద్దీ పెట్టుబడిని పెంచడం మంచిది.

Related Articles

Related image1
Mutton: ఈసారి మ‌ట‌న్ కొంటే ఈ పార్ట్‌ను క‌చ్చితంగా తీసుకోండి.. రుచి మాత్ర‌మే కాదు ఆరోగ్యం కూడా
Related image2
బ‌య‌ట రూ. 1500 ఉండే మందు బాటిల్ ఆర్మీ క్యాంటీన్‌లో రూ. 600కే ఎందుకు ల‌భిస్తుందో తెలుసా.?
35
తయారీ విధానం
Image Credit : Gemini AI

తయారీ విధానం

ఈ వ్యాపారం కోసం పెద్ద స్థలం అవసరం లేదు. ఇంట్లో ఒక శుభ్రమైన గది ఉంటే చాలు. శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, మంచి నాణ్యమైన నూనె, మసాలాలు వాడాలి. ఇది క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తుంది. ఇక స్టోరేజ్‌ సరైన విధంగా ఉండాలి. అలాగే అవకాయ, గోంగూర, చికెన్‌, ఫిష్ వంటి ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేయాలి. క్వాలిటీ బాగుంటే కస్టమర్లు తిరిగి మళ్లీ కొనుగోలు చేస్తారు. అందుకే మీ బ్రాండ్‌ను కూడా నాణ్య‌త ప్రాధాన్యంగా ప్ర‌చారం చేసుకోవాలి.

45
ఎలా విక్ర‌యించాలి.?
Image Credit : Gemini AI

ఎలా విక్ర‌యించాలి.?

పచ్చళ్ల వ్యాపారం విజయానికి మార్కెటింగ్ చాలా ముఖ్యం. మారిన కాలంతో పాటు మార్కెటింగ్ వ్యూహాల‌ను కూడా మార్చాలి. అందుకే వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి వాటి ద్వారా ప్ర‌చారం చేస్తూ ఆర్డ‌ర్ల‌ను స్వీక‌రించాలి. అలాగే అమెజాన్‌, మీషో వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో విక్ర‌యించ‌వ‌చ్చు. వీటితో పాటు స్థానిక షాపులకు సరఫరా చేయొచ్చు. చిన్న స్టాల్ లేదా షాప్ ఏర్పాటు చేసుకోవచ్చు.

55
లాభాలు ఎలా ఉంటాయి?
Image Credit : Gemini AI

లాభాలు ఎలా ఉంటాయి?

పచ్చళ్ల వ్యాపారం సరైన విధంగా చేస్తే మంచి లాభాలు వస్తాయి. మొదటి దశలో నెలకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు లాభం పొందొచ్చు. ఒక‌వేళ కస్టమర్ బేస్ పెరిగితే ఆదాయం మరింత పెరుగుతుంది. పెద్ద స్థాయిలో తయారీకి వెళ్తే ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్లు ఉపయోగించవచ్చు. ఇటీవ‌లి కాలంలో విదేశాల‌కు ప‌చ్చ‌ళ్ల ఎగుమ‌తి కూడా భారీగా పెరుగుతోంది. తెలుగు ప్రజలు విదేశాల్లో ఎక్కువగా ఉండటంతో అక్కడికి పచ్చళ్లకు మంచి డిమాండ్ ఉంది. దానిని కూడా క్యాష్ చేసుకోవ‌చ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఈ వ్యాపారం మొద‌లుపెట్టే ముందు అంత‌కు ముందు ఈ రంగంలో అనుభ‌వం ఉన్న వారిని నేరుగా సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image2
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Recommended image3
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Related Stories
Recommended image1
Mutton: ఈసారి మ‌ట‌న్ కొంటే ఈ పార్ట్‌ను క‌చ్చితంగా తీసుకోండి.. రుచి మాత్ర‌మే కాదు ఆరోగ్యం కూడా
Recommended image2
బ‌య‌ట రూ. 1500 ఉండే మందు బాటిల్ ఆర్మీ క్యాంటీన్‌లో రూ. 600కే ఎందుకు ల‌భిస్తుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved