MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బిజినెస్ ఐడియా: దళిత బంధు ద్వారా పొందిన రూ. 10 లక్షలతో ఈ వ్యాపారాలు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం..

బిజినెస్ ఐడియా: దళిత బంధు ద్వారా పొందిన రూ. 10 లక్షలతో ఈ వ్యాపారాలు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం..

బిజినెస్ ఐడియా: తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం కింద, అర్హులైన దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. దళిత బంధు స్కీం కిింద అందచేసే ఈ మొత్తం తిరిగి చెల్లించాల్సిన రుణంగా కాకుండా నేరుగా వారి ఆర్థిక అభ్యున్నతి కోసం అందిస్తోంది. అంతేకాదు ఈ డబ్బులతో లబ్దిదారులు తమకు నచ్చిన వ్యాపారం, స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టుకోవచ్చు.  

2 Min read
Author : Krishna Adhitya
Published : Sep 07 2022, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దళిత బంధు ద్వారా పొందిన ఆర్థిక సాయంతో లబ్ది దారులు రూ. 10 లక్షల రూపాయలతో ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా, అయితే కొన్ని బిజినెస్ ఐడియాలు మీ కోసం అందిస్తున్నాం. మీ వీలును బట్టి ఎంపిక చేసుకోవచ్చు. 
 

27

రూ.10 లక్షల మొత్తంతో ప్రస్తుత కాలంలో అనేక వ్యాపారాలను చేయవచ్చు. ముఖ్యంగా ఉన్న ఊరిలోనే మీరు చక్కటి వ్యాపారం చేయాలని అనుకుంటే మాత్రం, ట్రాన్స్ పోర్ట్ రంగంలో పెట్టుబడి పెట్టి, మీకు నచ్చిన వాహనం ద్వారా ఉపాధి పొందవచ్చు. రూ. 10 లక్షలతో మినీ ట్రక్ కొనుగోలు చేసుకోవడం ద్వారా మీరు చక్కటి వ్యాపారం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మినీ ట్రక్కులు రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకూ పలుకుతున్నాయి. 
 

37

చికెన్ షాపు ఫ్రాంచైజీ మోడల్ ద్వారా స్టార్ట్ చేసి కూడా చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. ఇక ప్రతి నెల రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ సంపాదించుకోవచ్చు. అలాగే కోడిగుడ్లను కూడా ఈ షాపులో విక్రయించడం ద్వారా మీకు అదనపు లాభం అందుతుంది. 
 

47

అలాగే పట్టణ ప్రాంతాల్లో  మిల్క్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. అమూల్, హెరిటేజ్, సంగం,  ఆరోక్య, మస్కతీ, దొడ్ల, జెర్సీ లాంటి పలు కంపెనీలు ఫ్రాంచైజీ మోడల్ ద్వారా మీరు మిల్క్ పార్లర్ పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ షాపుల్లో పాలు, పెరుగుతో పాటు అనేక మిల్క్ ప్రాడెక్టులను విక్రయించవచ్చు. తద్వారా ప్రతి నెల మంచి ఆదాయం పొందవచ్చు. ఈ ఫ్రాంచైజీలు రూ. 2 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. 
 

57

ఇక కిరాణా షాపు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు, అలాగే టౌన్ షిప్స్ లో కిరాణా దుకాణాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. అయితే పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెలసరి సరుకులు వేటికి గిరాకీ ఉందో వాటిని షాపులో ఉంచుకోవాలి. తద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. 
 

67

రూ. 10 లక్షలతో బేకరీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మీరు పని వాళ్లపై ఆధారపడకుండా, బేకరీ ఉత్పత్తుల తయారీని నేర్చుకోవాలి. అందుకోసం పలు హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీలు, అలాగే కల్లినరీ కోర్సులను నేర్చుకోవడం ద్వారా మీకు అవగాహన వస్తుంది. 

77

రూ. 10 లక్షలను బ్యాంకులో పొదుపు చేసుకోవడం ద్వారా వడ్డీ ఆదాయం కూడా రిస్క్ లేకుండా లభిస్తుంది. అయితే ద్రవ్యోల్బణం కారణంగా భవిష్యత్తులో ఆ వడ్డీ మొత్తం మీకు సరిపోకపోవచ్చు. అందుకే స్వయం ఉపాధి వైపు వెళ్లడం ఉత్తమం. 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
IndiGo : ఇండిగో సీఈఓ రాజీనామా.. కారణమేంటో తెలుసా?
Recommended image2
UPI: కార్డు లేకుండానే ఏటీఎమ్ నుంచి డ‌బ్బులు తీసుకోవచ్చు.. చేతిలో ఫోన్ ఉంటే చాలు
Recommended image3
Today Gold Rate In Hyderabad: బెంబేలెత్తిస్తున్న బంగారం, వెండి...ఒక్కసారిగా రూ.10వేలు జంప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved