- Home
- Business
- Business Idea: రైతుల ఆదాయం రెండింతలు చేసే బిజినెస్ ఐడియా ఇదే, నెలకు లక్షల్లో ఆదాయం పొందుతారు...
Business Idea: రైతుల ఆదాయం రెండింతలు చేసే బిజినెస్ ఐడియా ఇదే, నెలకు లక్షల్లో ఆదాయం పొందుతారు...
నేటి కాలంలో ఆర్గానిక్ పంటలకు డిమాండ్ బాగా పెరిగింది, ఈ నేపథ్యంలో రసాయన ఎరువులకు బదులుగా ఆర్గానిక్ ఎరువుల ఉత్పాదనకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఎరువుల వాడకం పెరుగుతోంది. దీంతో ఆర్గానిక్ ఎరువుల తయారీ కూడా రైతులకు మంచి ఆదాయ వనరు అయ్యే అవకాశం ఉంది.

ఆర్గానిక్ ఎరువుల తయారీకి రైతులు అనేక ఐడియాల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం మేము చెప్పే ఈ ఐడియా కూడా చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. తరచుగా అరటి తోటల్లో అరటి గెలను సేకరించిన తర్వాత అరటి చెట్లు నిరుపయోగంగా మారుతుంటాయి. ఆ చెట్టులోని అరటి కాండం పనికిరానిదిగా భావించి, వాటిని కత్తిరించి విసిరివేస్తారు. అయితే ఈ అరటి కాండం మీ ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. మీరు అరటి కాండం నుండి సేంద్రీయ ఎరువులు తయారు చేయవచ్చు. మార్కెట్‌లో విక్రయించి మంచి లాభం పొందవచ్చు.
అరటి పంటలు పండించే రైతులు సాధారణంగా దాని కాండం పారవేస్తారు, ఇది పర్యావరణం, నేల రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో నేల సారవంతం తగ్గుతుంది. కానీ ఈ కాండంను సేంద్రియ ఎరువుగా మార్చడం వల్ల లాభాలు పొందవచ్చు.
అన్నింటి కన్నా ముందు, మీరు ఒక గొయ్యిని తవ్వాలి, అందులో అరటి కాండం భాగాలను వేయాలి. ఆ తర్వాత ఆవు పేడ, కలుపు మొక్కలను కాండంతోపాటు గుంతలో వేయాలి. దీనితో పాటు డీకంపోజర్ కూడా స్ప్రే చేయండి. ఈ కాండం, ఇతర పదార్థాలు సేంద్రీయ ఎరువుగా కుళ్ళిపోతాయి. అందులోని సారవంతమైన మట్టిని రైతులు తమ పొలాల్లో ఆర్గానిక్ ఎరువులుగా సేకరించి పండించడానికి ఉపయోగించవచ్చు.
మీరు ఈ ఆర్గానిక్ ఎరువులను మార్కెట్లోకి తీసుకెళ్లడం ద్వారా విక్రయించవచ్చు. భారీ లాభం పొందవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. సేంద్రియ ఎరువు తయారీకి పెద్దగా ఖర్చు ఉండదు. అందువల్ల, దీని ఖర్చు కన్నా, నికర లాభం దాదాపు రెండింతలు ఉంటుంది.
సేంద్రియ ఎరువులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది
సేంద్రియ ఎరువు వాడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల నేల యొక్క సారవంతమైన శక్తిని కాపాడుకోవడమే కాకుండా, రసాయన రహిత కూరగాయలు, ధాన్యాలు పొందడం ద్వారా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.