BSNL: బీఎస్ఎన్ఎల్ కొత్త ఆల్ రౌండర్ ప్లాన్ అదుర్స్.. ఇక జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలే..
BSNL Prepaid Plans : టెలికాం సంస్థల మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరల్లో 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లు ఎక్కువ వ్యాలిడిటీ, డేటా, అపరిమిత కాల్స్ తో వస్తున్నాయి. వివరాల్లోకెళ్తే..

బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలో 5G సేవల ప్రవేశానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తన వినియోగదారులకు మెరుగైన అనుభవం కల్పించేందుకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల చేసింది. ఈ ప్లాన్లు ఎక్కువ వాలిడిటీ, అధిక డేటా ప్రయోజనాలు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు కొన్ని ప్లాన్లతో OTT సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉచితంగా అందిస్తున్నది. ఆ ప్లాన్ వివరాలేంటో ఓ లూక్కేయండి.
రూ.897 ప్లాన్
BSNL ₹897 ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలని భావించే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ప్లాన్‌లో 180 రోజుల వ్యాలిడిటీ, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, మొత్తం 90GB డేటా లభిస్తుంది. నెలనెలా రీఛార్జ్ చేయడం ఇబ్బంది అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే.. సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయి.
BSNL రూ.599 ఆల్-రౌండర్ ప్లాన్
BSNL కొత్తగా ప్రకటించిన రూ. 599 "ఆల్-రౌండర్" అదుర్స్ అనే చెప్పాలి. ఈ ప్లాన్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతి రోజు 3GB డేటా (మొత్తం 252GB), అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌ను BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేయవచ్చు. డేటా ఎక్కువగా ఉపయోగించే వారు, ఎక్కువ కాల్ చేసే వారికి ఇది బెస్ట్ ప్లాన్.
రూ.249 బడ్జెట్ ప్లాన్
బడ్జెట్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని BSNL మరో సరికొత్త ప్లాన్ తీసుకవచ్చింది. అదే రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులు, రోజుకు 2GB డేటా (మొత్తం 90GB), అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు. ఈ ప్లాన్ లో ప్రత్యేక ఆకర్షణ BSNL BiTV OTT యాక్సెస్ ను ఉచితంగా అందిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్.
జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలే..
BSNL తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లు అన్ని రకాల యూజర్ల అవసరాలను తీర్చేలా ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాల్స్, OTT లాంటి అదనపు బెనిఫిట్స్‌తో ఈ ప్లాన్లు వస్తున్నాయి. ఈ ఆఫర్లు కొత్త కస్టమర్లను భారీగా ఆకర్షించేలా ఉన్నాయి. ఈ ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ చూస్తే… నిజంగానే జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలు కనిపించేలా ఉన్నాయ్!