MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • BSNL : ఇది కదా అసలైన ఆఫర్.. కేవలం రూ. 1కే 30 రోజుల డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

BSNL : ఇది కదా అసలైన ఆఫర్.. కేవలం రూ. 1కే 30 రోజుల డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

BSNL Freedom Offer : భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. 'ఫ్రీడమ్ ఆఫర్‌' కింద 'ఆజాది కా ప్లాన్' పేరుతో లాంచ్ చేసింది. కేవలం రూ. 1 కే  అదిరిపోయే ఆఫర్.  

2 Min read
Rajesh K
Published : Aug 02 2025, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అదిరిపోయే బంపర్ ఆఫర్
Image Credit : Getty

అదిరిపోయే బంపర్ ఆఫర్

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కొత్త కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. అదిరిపోయే బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి భారీ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. మరోసారి తన వినియోగదారులను మళ్లించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్లే ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు బిగ్ షాకిస్తూ కేవలం 1 రూపాయికే 'ఆజాదీ కా ప్లాన్' అందుబాటులోకి తెచ్చింది. 

25
ఆజాది కా ప్లాన్
Image Credit : Getty

ఆజాది కా ప్లాన్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. 'ఫ్రీడమ్ ఆఫర్‌' కింద 'ఆజాది కా ప్లాన్' పేరుతో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి అన్ని ఫీచర్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్ ఆఫర్‌తో కూడిన ఈ ప్లాన్ జియో, ఎయిర్‌టెల్ లకు గట్టిపోటీ ఇవ్వబోతుందా? అనే వివరాలు మీ కోసం.

Related Articles

Related image1
BSNL: బీఎస్ఎన్ఎల్ కొత్త ఆల్ రౌండర్ ప్లాన్ అదుర్స్.. ఇక జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలే..
Related image2
BSNL: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ అదుర్స్: రూ.599కే 84 రోజుల వ్యాలిడిటీ
35
 BSNL రూ. 1 ప్లాన్ వివరాలు
Image Credit : Getty

BSNL రూ. 1 ప్లాన్ వివరాలు

BSNL ఫ్రీడమ్ డే ఆఫర్ క్రింద ‘ఆజాది కా ప్లాన్’ పేరిట వినూత్న ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 1 కే లభించే ఈ ప్లాన్‌లో డైలీ 2GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లాంటి అద్భుత ప్రయోజనాలు అందిస్తోంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. 

BSNL’s Freedom Offer - Only @ ₹1!
Enjoy a month of digital azadi with unlimited calls, 2GB/day data 100 SMS & Free SIM. 

Free SIM for New Users.#BSNL#DigitalIndia#IndependenceDay#BSNLFreedomOffer#DigitalAzadipic.twitter.com/aTv767ETur

— BSNL India (@BSNLCorporate) August 1, 2025

45
 ఈ ఆఫర్ ఎప్పుడు? ఎలా పొందాలి?
Image Credit : Getty

ఈ ఆఫర్ ఎప్పుడు? ఎలా పొందాలి?

ఈ ఆఫర్ ఆగస్టు 1 నుండి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 31లోపు ప్లాన్‌ను యాక్టివేట్ చేయలేకపోతే, ఈ అదిరిపోయే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు తమకు సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్ షాపుని సందర్శించి ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు. 

55
ఈ వ్యూహం ఫలించేనా?
Image Credit : Getty

ఈ వ్యూహం ఫలించేనా?

ఇటీవలి TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 జూన్ 30,2025 నాటికి BSNL 3 లక్షలకు పై సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీన్ని మొత్తం యూజర్ బేస్ 90,464,244కి చేరుకుంది. ఇందులో 29,822,407 రూరల్ కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో, BSNL“ఫ్రీడమ్ ఆఫర్” వినియోగదారులను మళ్లీ ఆకర్షించేందుకు తీసుకున్న ప్రత్యేక వ్యూహంగా పరిగణించవచ్చు. ఈ ఆఫర్‌తో పాటు, ఇతర అనుబంధ ప్రీపెయిడ్ ప్యాన్స్ ను కూడా BSNL తీసుకరానుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved