లక్ష టవర్ల ఏర్పాటే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్: 4G సేవలు మరింత స్పీడ్‌గా..
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం జెట్ స్పీడ్ వేగంతో పనిచేస్తోంది. ఇప్పటికే సిగ్నల్ టవర్స్ ఏర్పాటు వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా లక్ష టవర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వేగంగా పనిచేస్తోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ పనులు ఎంత వరకు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జియో, ఎయిర్ టెల్ నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోవడానికి బీఎస్ఎన్ఎల్ దీటుగా పనిచేస్తోంది. ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ ధరలు తగ్గించి జియో, ఎయిర్ టెల్, VI టెలికాం సంస్థల నుంచి వినియోగదారులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే లక్షల్లో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ లోకి చేరారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో తన వినియోగదారులకు మరిన్ని సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ 4G టవర్లు పనులు వేగవంతం చేసింది.
బీఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 65,000 టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. లక్ష టవర్ల లక్ష్యంతో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్, సర్వీస్‌ను కూడా మెరుగుపరుస్తోంది.
ఇతర టెలికాం సంస్థల్లో కొన్ని విదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ టెక్నాలజీతో 4G సేవలు అందిస్తోంది. 65,000 టవర్లు దాటినట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ రాబర్ట్ జె.రవి తెలిపారు.
2025 సంవత్సరం సగం పూర్తయ్యే సరికి లక్ష 4G టవర్ల ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో బీఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది. ఆలస్యంగా 4G ప్రారంభించినా పూర్తిగా స్వదేశీ 4G టెక్నాలజీతో సేవలందిస్తున్న ఏకైక సంస్థ బీఎస్ఎన్ఎల్ కావడం విశేషం.