స్పామ్ కాల్స్, మెసేజస్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? బ్లాక్ చేయడానికి సింపుల్ టిప్స్ ఇవిగో
మీకు పర్సనల్ లోన్ కావాలా? క్రెడిట్ కార్డు తీసుకుంటారా? అంటూ అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయా? ఆఫీసు వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి స్పాస్ కాల్స్ ని అడ్డుకోవచ్చు, బ్లాక్ కూడా చేయొచ్చు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, బిఎస్‌ఎన్‌ఎల్ ఏ నెట్‌వర్క్ అయినా స్పామ్ కాల్స్‌ని సులభంగా బ్లాక్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. అయితే ఈ స్మార్ట్ ఫోన్లలోనే అనేక మార్కెటింగ్ యాడ్స్, కాల్స్ వస్తుంటాయి. లోన్స్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ఇస్తామని చిరాకు తెప్పిస్తారు. వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తారు. ఇలాంటి స్పామ్ కాల్స్ వల్ల ప్రైవసీ, డేటా దొంగతనం కూడా జరిగే ప్రమాదం ఉంది.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు జియో, ఎయిర్‌టెల్, వీఐ, బిఎస్‌ఎన్‌ఎల్.. ఏ నెట్‌వర్క్ అయినా స్పామ్ కాల్స్‌ని సులభంగా బ్లాక్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఎయిర్‌టెల్ యూజర్లు ఏం చేయాలి?
ట్రాయ్ ప్రారంభించిన డిఎన్‌డి సర్వీస్‌ని యాక్టివేట్ చేయడానికి మీ ఫోన్ నుండి “START 0” అని 1909కి SMS పంపండి. తర్వాత కన్ఫర్మేషన్ స్టెప్స్ పూర్తి చేయండి.
ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఓపెన్ చేయండి
'మోర్' లేదా 'సర్వీసెస్' మీద క్లిక్ చేయండి.
డిఎన్‌డి ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కాల్స్ టైప్ సెలెక్ట్ చేయండి.
జియో యూజర్లు ఇలా చేయండి
మైజియో యాప్ ఓపెన్ చేయండి.
మెనూకి వెళ్ళండి.
సెట్టింగ్స్ లో సర్వీస్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి.
'డూ నాట్ డిస్టర్బ్' సెలెక్ట్ చేసి ఆన్ చేయండి.
Vi (వోడాఫోన్-ఐడియా) యూజర్లు ఇలా చేయండి
Vi యాప్ ఓపెన్ చేయండి.
మెనూకి వెళ్ళండి.
డిఎన్‌డి ఆప్షన్ ఓపెన్ చేయండి.
ప్రమోషనల్ మెసేజెస్, కాల్స్ బ్లాక్ చేయండి.
బిఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు ఇలా చేయండి
బిఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు 1909 SMS మెథడ్ లేదా బిఎస్‌ఎన్‌ఎల్ డిఎన్‌డి రిజిస్ట్రేషన్ పేజీ ద్వారా స్పామ్ కాల్స్ బ్లాక్ చేయవచ్చు.
స్పామ్ కాల్స్‌ని పూర్తిగా ఆపవచ్చు
ఈ సింపుల్ సెట్టింగ్స్ ద్వారా మీరు స్పామ్ కాల్స్ రాకుండా ఆపొచ్చు.
స్పామ్ కాల్స్, మెసేజస్ ని బ్లాక్ చేయాలంటే మీ రిజస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1909కి ‘FULLY BLOCK’ అని మెసేజ్ చేయండి. ఇది పంపిన 24 గంటల్లో మీకు స్పామ్ కాల్స్, మెసేజస్ బ్లాక్ చేస్తున్నట్లుగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ప్రకటనలకు సంబంధించిన కాల్స్, మెసేజ్ లు రావడం ఆగిపోతాయి.