మహిళలకు నెలకు రూ. 7,000 స్టైఫండ్.. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఇది
Bima Sakhi Yojana: కేంద్ర ప్రభుత్వ బీమా సఖి యోజన పథకం 18 నుండి 70 ఏళ్ల మహిళలకు LIC ఏజెంట్లుగా శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. మూడేళ్ల శిక్షణా కాలంలో నెలవారీ స్టైపెండ్ కూడా అందిస్తుంది.
బీమా సఖి యోజన
ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక పథకాలు ఉన్నాయి. ఈ కోవలోనే మహిళల కోసం మరో కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇటీవల ప్రారంభించింది. ఇది మహిళలకు పనిని నేర్పుతున్న సమయంలోనే స్టైఫండ్ ను కూడా అందిస్తుంది. నెలకు 7000 రూపాయల స్టైఫండ్ ను అందించే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీమా సఖి యోజన
మహిళల ఆర్థిక ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం
దేశవ్యాప్తంగా మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పథకాన్నితీసుకువచ్చింది. అదే 'బీమా సఖి యోజన'. ఈ పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా ప్రారంభించిన ఈ పథకం మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, వారి ఆర్థిక అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం కోసం తీసుకువచ్చిన పథకాల్లో ఇది ఒకటి.
బీమా సఖి లక్షణాలు
LIC ద్వారా అందిస్తున్న బీమా సఖీ (MCA స్కీమ్) అనేది మహిళల కోసం ప్రత్యేకంగా 3 సంవత్సరాల స్టైపెండరీ వ్యవధితో కూడిన స్టైపెండియరీ పథకం. ఇక్కడ పనిని నేర్పుతూనే ఉపాధి కల్పించడం, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం ఈ పథకం ఉద్దేశం.
బీమా సఖి పథకం ముఖ్య విషయాలు:
1. 18-70 ఏళ్ల మహిళలు
2. 10వ తరగతి ఉత్తీర్ణత
3. LIC ఏజెంట్లుగా శిక్షణ, గ్రామీణ ఉద్యోగాలు
శిక్షణ, స్టైపెండ్:
మూడేళ్ల శిక్షణ ఉంటుంది.
స్టైపెండ్: ₹7,000 (1వ సంవత్సరం), ₹6,000 (2వ సంవత్సరం), ₹5,000 (3వ సంవత్సరం)
బీమా సఖీ పథకం అర్హతలు:
మహిళలు మాత్రమే
10వ తరగతి ఉత్తీర్ణత
18-70 ఏళ్ల మధ్య వయస్సు
శిక్షణ తర్వాత LIC ఏజెంట్లుగా నియామకం
బీమా సఖి యోజన
పనితీరు లక్ష్యాలు:
వార్షిక పనితీరు లక్ష్యాలను చేరుకోవాలి
అమ్మిన పాలసీల్లో 65% కొనసాగాలి
నిధులు, మద్దతు:
₹100 కోట్ల ప్రారంభ నిధి
ఆర్థిక అవగాహన, స్థిరమైన ఆదాయం
బీమా సఖి పథకం-ఆన్ లైన్ అప్లికేషన్
ఎల్ఐసీ ద్వారా అందిస్తున్న ఈ పథకం కోసం మీరు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
అన్ లైన్ అప్లికేషన్ కోసం డైరెక్ట్ లింక్ : బీమా సఖి పథకం-ఆన్ లైన్ అప్లికేషన్
దరఖాస్తు ఫారమ్‌కు కింది పత్రాలు కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
1. వయస్సు రుజువు, స్వీయ-ధృవీకరించబడిన కాపీ
2. చిరునామా రుజువు, స్వీయ-ధృవీకరించబడిన కాపీ
3. విద్యా అర్హత సర్టిఫికేట్, స్వీయ-ధృవీకరించబడిన కాపీ
4. తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అప్‌లోడ్ చేయాలి.