MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Biliti Electric: తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు..మంత్రి అజయ్ హర్షం

Biliti Electric: తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు..మంత్రి అజయ్ హర్షం

కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎల‌క్ట్రిక్ కంపెనీ.. ప్రపంచం లోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీ-వీల‌ర్ ఫ్యాక్టరీని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రముఖ EV వాహనాల తయారీ కంపెనీ ఫిస్కర్‌, హైదరాబాద్‌లో తమ రెండో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ స‌ర‌స‌న బిలిటీ ఎల‌క్ట్రిక్ కంపెనీ ఏర్పాటు కానుంది. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 20 2022, 08:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తెలంగాణకు మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని పెట్టుబడుల సాధనకి పడుతున్న తపన రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. కేటీఆర్ చొరవతో అమెరికాకు చెందిన ప్రసిద్ధ విద్యుత్‌ వాహనాల సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్‌ రాష్ట్రంలో రూ.1,144 కోట్లతో భారీ త్రిచక్ర వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయంపై పట్ల మంత్రి అజయ్ హర్షం వ్యక్తం చేశారు.   
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అంతేకాదు ఇటీవలే అమెరికాకు చెందిన ఈవీ సంస్థ ఫిస్కర్‌ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందం మేరకు హైదరాబాద్‌లో రెండో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించడం శుభపరిణామమని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఏడాదికి 2.4 లక్షల విద్యుత్‌ వాహనాల తయారీ సామర్థ్యంతో సంగారెడ్డి జిల్లా వెల్మల పారిశ్రామికవాడలో 13.5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించనుందని మంత్రి వివరించారు. 
 

34

రాష్ట్రంలో మౌలిక వసతులు అత్యుత్తమంగా ఉన్నందున రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాల ప్రపంచస్థాయి కేంద్రంగా(హబ్‌) తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉత్ప‌త్తికి తెలంగాణ‌ను గ‌మ్య‌స్థానంగా మార్చాల‌నే ఉద్దేశంతో ఈవీ పాల‌సీని ప్రారంభించిన‌ట్లు గుర్తు చేశారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అన్నారు.

44

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్ తో ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కంపెనీల ఏర్పాటు చేయాలని చూస్తున్నారంటే దాని వెనకాల మంత్రి కేటీఆర్ కఠోర శ్రమ, కృషి ఎంతో ఉన్నదని అన్నారు. ప్రపంచ మేటి పరిశ్రమలు తెలంగాణకు రావడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి స్పష్టంచేశారు. మరో 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani
వ్యాపారం
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image2
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image3
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved