ఎక్కువ వడ్డీ, జీరో బ్యాలెన్స్.. స్టూడెంట్స్ కోసం బెస్ట్ సేవింగ్స్ అకౌంట్స్
Best Student Savings Accounts: విద్యార్థుల కోసం జీరో బ్యాలెన్స్, డిజిటల్ సదుపాయాలు, ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న ప్రముఖ బ్యాంకుల స్టూడెంట్ సేవింగ్స్ అకౌంట్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్టూడెంట్స్ కోసం బెస్ట్ సేవింగ్స్ అకౌంట్స్
విద్యార్థుల జీవితంలో డబ్బు నిర్వహణ చాలా ముఖ్యమైన అంశం.. అలాగే, కీలక నైపుణ్యం కూడా. స్కూల్, కాలేజ్ విద్యార్థులు తమ స్కాలర్‌షిప్, ఖర్చుల డబ్బులు, పార్ట్‌టైమ్ సంపాదనను భద్రపరచుకోవడానికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా విద్యార్థుల కోసం అనేక బ్యాంకులు జీరో బ్యాలెన్స్, డిజిటల్ సదుపాయాలు, ఉచిత డెబిట్ కార్డులు, ఆకర్షణీయ వడ్డీ రేట్లతో స్టూడెంట్ సేవింగ్స్ అకౌంట్స్ అందిస్తున్నాయి.
స్టూడెంట్ సేవింగ్స్ అకౌంట్ ప్రత్యేకతలు ఏంటి?
విద్యార్థుల కోసం ఓపెన్ చేసే బ్యాంకు అకౌంట్స్‌లో ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. వీటిలో జీరో లేదా తక్కువ మినిమమ్ బ్యాలెన్స్, ఉచిత ATM/డెబిట్ కార్డ్, మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఎలాంటి హిడెన్ చార్జీలు లేకపోవడం, ఉచిత SMS, ఇమెయిల్ అలర్ట్‌లు, యూపీఐ, డిజిటల్ వాలెట్ యాక్సెస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ అకౌంట్స్ విద్యార్థుల్లో డబ్బు పట్ల బాధ్యతను పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సౌకర్యాలు అందిస్తున్న బ్యాంకులు-స్టూడెంట్స్ సేవింగ్స్ అకౌంట్స్ వివరాలు గమనిస్తే..
ICICI Campus Power Account
• వడ్డీ: 3.00% – 3.50%
• మినిమమ్ బ్యాలెన్స్: అవసరం లేదు
• సౌకర్యాలు: ఉచిత ATM కార్డ్, డిజిటల్ టూల్స్, ఎడ్యుకేషన్ లోన్, కాలేజ్ స్టూడెంట్స్‌కు అనుకూలంగా ఉంటుంది.
HDFC DigiSave Youth Account
• వడ్డీ: 3.00% – 3.50%
• మినిమమ్ బ్యాలెన్స్: ₹2,500 – ₹5,000
• సౌకర్యాలు: క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, మొబైల్ బ్యాంకింగ్, 18–25 ఏళ్ల విద్యార్థులకు సరైన ఎంపిక.
Axis Youth Account
• వడ్డీ: 3.00% – 4.00%
• మినిమమ్ బ్యాలెన్స్: అవసరం లేదు
• సౌకర్యాలు: పర్సనలైజ్డ్ డెబిట్ కార్డ్, UPI సపోర్ట్, 10–25 ఏళ్ల వయస్సు వారికి అనువైన అకౌంట్.
Federal Young Champ Account
• వడ్డీ: 2.50% – 5.00%
• మినిమమ్ బ్యాలెన్స్: అవసరం లేదు
• సౌకర్యాలు: పేరెంటల్ కంట్రోల్, మొబైల్ బ్యాంకింగ్, 18 ఏళ్ల లోపు పిల్లలకు సరైన ఎంపిక.
KVB Student Account
• వడ్డీ: 3.00%
• మినిమమ్ బ్యాలెన్స్: అవసరం లేదు
• సౌకర్యాలు: మొబైల్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, సులభమైన అకౌంట్, 10+ ఏళ్ల విద్యార్థులకు, ఎలాంటి ఛార్జీలు లేవు.
IndusInd Basic Student Account
• వడ్డీ: 3.50% – 6.00%
• మినిమమ్ బ్యాలెన్స్: అవసరం లేదు
• సౌకర్యాలు: డెబిట్ కార్డ్, SMS అలర్ట్‌లు, 18+ విద్యార్థులకు, ఎక్కువ వడ్డీ కోరేవారికి అనుకూలం.
IDFC FIRST Student Account
• వడ్డీ: 4.00% – 7.00%
• మినిమమ్ బ్యాలెన్స్: అవసరం లేదు
• సౌకర్యాలు: డెబిట్ కార్డ్, మొబైల్ బ్యాంకింగ్, 18+ విద్యార్థులకు, అత్యధిక వడ్డీ రేటు.
SBI Yuva Savings Account
• వడ్డీ: 2.70% – 3.00%
• మినిమమ్ బ్యాలెన్స్: అవసరం లేదు
• సౌకర్యాలు: ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత చెక్‌బుక్, ప్రభుత్వ పథకాల కోసం సరైన ఎంపిక.
సిటీ యూనియన్ బ్యాంకు: CUB Young India Account
• వడ్డీ: 3.50%
• మినిమమ్ బ్యాలెన్స్: ₹500
• సౌకర్యాలు: ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, ఉచిత NEFT/RTGS, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుల కోసం మంచి అకౌంట్.
విద్యార్థుల కోసం సరైన ఎంపిక
బ్యాంకుల వడ్డీ రేట్లు బ్యాలెన్స్‌పై ఆధారపడి మారుతాయి. అయినప్పటికీ, ICICI, HDFC, Axis, SBI, IDFC FIRST వంటి బ్యాంకుల స్టూడెంట్ అకౌంట్స్ విద్యార్థులకు అత్యుత్తమంగా పరిగణించేవిగా ఉన్నాయి.
వీటిలో జీరో బ్యాలెన్స్, డిజిటల్ సదుపాయాలు, అధిక వడ్డీ రేట్లు అందుబాటులో ఉండటం వల్ల స్కూల్, కాలేజ్ విద్యార్థులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.