Asianet News TeluguAsianet News Telugu

Smart Phones Under 20K: రూ. 20 వేల లోపు విలువ గ‌ల 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ఇండియన్ మార్కెట్‌లో రూ.20 వేల లోపు బడ్జెట్‌ ఫోన్‌లు వినియోగదారులను అమితంగా ఆకట్టుకొంటున్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టి ఫోన్‌ కొనాల్సిన అవసరం లేదని భావించేవాళ్లు.. చక్కటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలింవచ్చు.
 

Best Mobile Phones Under Rs. 20000
Author
Hyderabad, First Published Jun 27, 2022, 3:26 PM IST

ఒక‌వేళ మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా.. మీ బ‌డ్జెట్ రూ.20 వేల లోపు ఉందా.. అయితే.. రూ.20 వేల లోపు టాప్‌-5 స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా రూ.15-20 వేల లోపు స్మార్ట్ ఫోన్ల క్యాట‌గిరీకి విప‌రీత‌మైన కాంపిటీష‌న్ ఉంది. ఈ కాంపిటీష‌న్‌లో క‌స్ట‌మ‌ర్లు చాలా బెనిఫిట్లు పొందుతున్నారు క‌స్ట‌మ‌ర్లు. ఈ సెగ్మెంట్‌లో మెరుగైన ఫీచ‌ర్లు గ‌ల స్మార్ట్ ఫోన్ల‌ను ఆవిష్క‌రిస్తున్నాయి. కొంత‌కాలం కింద‌టి వ‌ర‌కు రూ.30-50 వేల‌లోపు విలువ గ‌ల ఫోన్లు మాత్ర‌మే ఉండేవి. మంచి పెర్ఫార్మెన్స్ గ‌ల గేమింట్ స్మార్ట్ ఫోన్లు కూడా ఇదే క్యాట‌గిరీలో ఉంచాలి. రూ.20 వేల లోపు విలువ గ‌ల ఐదు బెస్ట్ స్మార్ట్ ఫోన్లేవో ఓ లుక్కేద్దామా..!

పొకో ఎక్స్‌4

పొకో ఎక్స్4 ప్రో ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీ, డిజైన్ చాలా బాగుంటాయి. బ్యాక్ ప్యానెల్ పూర్తిగా గ్లాస్‌తో క‌వ‌ర్ చేసి ఉంటుంది. గ‌త ఏప్రిల్ ఐదో తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్క‌రించారు. పొకో ఎక్స్‌4 ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్ ఉంటుంది. దీని డిస్‌ప్లే 6.67 అంగుళాలు ఉంటుంది. 64 ఎంపీ ప్ల‌స్‌, 8ఎంపీ, 2 ఎంపీ సామ‌ర్థ్యం గ‌ల మూడు కెమెరాలు ఫోన్ బ్యాక్‌లోనూ, 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్‌లో మ‌రో కెమెరా ఉంటుంది. దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 5000 ఎంఏహెచ్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ 6జీబీ రామ్‌, 64 జీబీ స్టోరేజ్ రామ్ సామ‌ర్థ్యం ఉంటుంది. దీని ధ‌ర రూ.16,999.

షియోమీ రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్ల‌స్‌

120 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్‌తోపాటు108 మెగా పిక్సెల్ ప్రైమ‌రీతోపాటు అమోల్డ్ ప్యానెల్ క‌ల షియోమీ రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్ల‌స్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ఈ ఫీచ‌ర్లేవీ ల‌భించ‌డం లేదు. స్నాప్ డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్‌, ఎల్ఈడీ ప్యానెల్‌తోపాటు 108ఎంపీ, 8ఎంపీ, 2 ఎంపీ సామ‌ర్థ్యం గ‌ల మూడు కెమెరాలు ఉన్నాయి. అద‌నంగా ఫ్రంట్‌లో 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ట‌ర్బో చార్జింగ్ సపోర్ట్‌తోపాటు 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ ఉంటుంది. ఈ ఫోన్ 6జీబీ రామ్, 128 జీబీ స్టోరేజీ సామ‌ర్థ్యం ఉంటుంది. దీని ధ‌ర రూ.19,999.

వ‌న్‌ప్ల‌స్ నొర్డ్ సీఈ 2 లైట్ 5జీ

రూ.20 వేల లోపు క్యాట‌గిరీలో వ‌న్‌ప్ల‌స్ తీసుకొస్తున్న తొలి స్మార్ట్ ఫోన్‌. 64 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమ‌రా, రెండు 2-ఎంపీ సెన్స‌ర్ కెమెరాలు ఉంటాయి. ఇన్‌ఫ్రంట్‌లో 16 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్‌, ఓక్టాకోర్ సీపీయూ (2.2గిగా హెర్ట్జ్, డ్యుయ‌ల్ కోర్‌), 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ చార్జ‌ర్ ల‌భిస్తుంది. 6జీబీ /128జీబీ వేరియంట్ల‌లో ల‌భించే ఈ ఫోన్ ధ‌ర రూ.19,999.

రియాలిటీ 9 5జీ ఎస్ఈ

144 హెర్ట్జ్ రీఫ్రీష్ రేట్‌తోపాటు 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే గ‌ల ఫోన్ రియాలిటీ 9 5జీ ఎస్ఈ. ఇందులో స్నాప్ డ్రాగ‌న్ 778 ఎస్‌వోసీ, 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గల బ్యాట‌రీ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు 48 మెగా పిక్సెల్‌, 2 ఎంపీ, 2 ఎంపీ సామ‌ర్థ్యం గ‌ల మూడు కెమెరాలు ఉన్నాయి. ఇన్ ఫ్రంట్‌లో 16 మెగా పిక్సెల్ సామ‌ర్థ్యం గ‌ల సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 30వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సామ‌ర్థ్యం గ‌ల చార్జ‌ర్ గ‌ల ఈ ఫోన్ 128జీబీ స్టోరేజీ సామ‌ర్థ్యంతోపాటు 6జీబీ రామ్ క‌లిగి ఉంది. దీని ధ‌ర రూ.19,999.

వివో టీ1 5జీ

6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే స్క్రీన్ గ‌ల వివో టీ1 5జ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 685 ప్రాసెస‌ర్ క‌లిగి ఉంటుంది. 28జీబీ స్టోరేజీతోపాటు 8జీబీ రామ్ క‌లిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా, 2 మెగా పిక్సెల్స్ ఫోన్లు బ్యాక్‌లో ఉన్నాయి. 2 ఎంపీల‌తో కూడి డెప్త్ సెన్స‌ర్ గ‌ల మాక్రో కెమెరాతోపాటు సెల్ఫీ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ గ‌ల 5000ఎంఏహెచ్‌ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ ఉంటుంది. దీని ధ‌ర రూ.15,990.

Follow Us:
Download App:
  • android
  • ios