Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Power beats Pro 2: మీ హార్ట్ బీట్ ని చెప్పే బెస్ట్ ఇయర్‌ఫోన్స్ ఇవిగో

Power beats Pro 2: మీ హార్ట్ బీట్ ని చెప్పే బెస్ట్ ఇయర్‌ఫోన్స్ ఇవిగో

Power beats Pro 2: మీరు ఫిట్‌నెస్ కోసం కష్టపడుతుంటారా? లేదా మీరు క్రీడాకారులా? మీలాంటి వారి కోసం బీట్స్ కంపెనీ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ మోడల్ పవర్‌బీట్స్ ప్రో 2ని విడుదల చేసింది. హార్ట్ బీట్ ని మానిటరింగ్ చేసే ఈ ఇయర్ ఫోన్స్ ధర, ఫీచర్స్ తెలుసుకుందాం రండి. 

Naga Surya Phani Kumar | Published : Feb 12 2025, 06:55 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ఫిట్‌నెస్ కోసం కసరత్తులు చేసే వారికి, క్రీడాకారుల కోసం రూపొందించిన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ఇవి. ఈ ఇయర్‌ఫోన్‌లు ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌లతో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌, స్పేషియల్ ఆడియో, వాయిస్ ఐసోలేషన్ సపోర్ట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఇవి వైర్‌లెస్ డివైజ్ ద్వారా ఛార్జింగ్‌ అవుతాయి. అంతేకాకుండా USB టైప్-C పోర్ట్‌ను కూడా కలిగి ఉన్నాయి.

 

24
Asianet Image

పవర్‌బీట్స్ ప్రో 2 ధర, రంగులు 

పవర్‌బీట్స్ ప్రో 2 ధర రూ. 29,900. జెట్ బ్లాక్, క్విక్ సాండ్, హైపర్ పర్పుల్ మరియు ఎలక్ట్రిక్ ఆరెంజ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఈ డివైస్ ఫిబ్రవరి 13న మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

డైనమిక్ హెడ్ ట్రాకింగ్, స్పేషియల్ ఆడియోతో, లేెెటెస్ట్ వెర్షన్ ఇయర్ ఫోన్స్ ఇవి. వీటిల్లో అదనంగా అడాప్టివ్ EQని ఉంది. ఇది వినియోగదారుల చెవికి అనుకూలంగా సెట్ అవుతుంది. ఇయర్‌బడ్‌లు ట్రాన్స్‌పరెన్సీ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)లను కూడా కలిగి ఉన్నాయి. దాదాపు 1,000 మంది అథ్లెట్లు పవర్‌బీట్స్ ప్రో 2ని పరీక్షించారని కంపెనీ ప్రకటించింది. 

34
Asianet Image

ఇదే పవర్‌బీట్స్ ప్రో 2 స్పెషాలిటీ

LED ఆప్టికల్ సెన్సార్‌లను ఉపయోగించి సెకనుకు 100 కంటే ఎక్కువ సార్లు రక్త ప్రవాహాన్ని కొలిచే హార్ట్ రేట్ మానిటరింగ్ కొత్త మోడల్‌ ప్రత్యేకత. రన్నా, నైక్ రన్ క్లబ్, ఓపెన్ వంటి అనేక ఫిట్‌నెస్ యాప్‌లు ఈ డేటాను యాక్సెస్ చేయగలవు. వ్యాయామాల సమయంలో వినియోగదారులు వారి హృదయ స్పందన రేటును చెక్ చేసుకోవచ్చు. 

పవర్‌బీట్స్ ప్రో 2 క్లాస్ 1 బ్లూటూత్‌ను కూడా కలిగి ఉంది. ఇది ఆపిల్ పరికరాల కోసం ఆటోమేటిక్ స్విచింగ్, వన్ టచ్ పెయిరింగ్‌ను అనుమతిస్తుంది. అదనంగా ఇది ఫైండ్ మై, ఆడియో షేరింగ్, హ్యాండ్స్ ఫ్రీ సిరి యాక్టివేషన్ వంటి ఫంక్షన్‌లను కలిగి ఉంటుంది. 

44
Asianet Image

బ్యాటరీ, ఛార్జ్

ఆపిల్ రూపొందించిన H2 చిప్‌ని ఉపయోగించి పవర్‌బీట్స్ 45 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. కేవలం ఐదు నిమిషాల ఛార్జ్‌తో దాదాపు 90 నిమిషాల ప్లేబ్యాక్ సాధ్యమవుతుంది. 

 

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories