సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
బ్యాంకులతో మనకు ప్రతి రోజు ఏదో విధంగా పని ఉంటుంది. మరి ఈ సెప్టెంబర్ నెలలో ఏకంగా చాలా రోజులు బ్యాంకులు పనిచేయవు. అయితే ఆ సెలవు రోజుల గురించి ముందే తెలుసుకుంటే పనులు టైమ్‌కు జరిగేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ సెలవుల గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సెప్టెంబర్ నెలలో ఉన్న 30 రోజుల్లో బ్యాంకులు 9 రోజులు పనిచేయవు. అందులో నేషనల్ హాలిడేస్ కూడా ఉన్నాయి. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు, ఇతర హాలిడేస్ కలిసి ఈ నెలలో మన రాష్ట్రంలో 9 రోజులు బ్యాంకులు పనిచేయవు.
వినాయక చవితి పండగ
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో అనేక పండగలు జరుగుతాయి. హిందువులకు చాలా ఇష్టమైన వినాయక చవితి పండగ ఈ నెలలోనే వస్తుంది. తొమ్మిది రోజులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించే ఈ నవరాత్రులను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఊరూ వాడా తేడా లేకుండా పట్టణాలు, పల్లెల్లోనూ సందడిగా చేస్తారు. ఆ వినాయక చవితి ఈ నెలలో 7 వ తేదీన వచ్చింది. ఈ రోజు శనివారం కావడం విశేషం. దేశ వ్యాప్తంగా ఈ రోజును ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. మరుసటి రోజు ఆదివారం కలిసి రావడంతో దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల సంబరాలు అంబరాన్నంటుతాయి.
ఈద్-ఎ-మిలాద్ (Eid e Milad)
సెప్టెంబర్‌లో మరో పబ్లిక్ హాలిడే కూడా ఉంది. ముస్లిం సోదరులకు జరుపుకొనే ఈద్-ఎ-మిలాద్ సెప్టెంబర్ 16న వచ్చింది. ఈ పండుగను నబీ డే లేదా మౌలిద్ అని కూడా అంటారు. ముహమ్మద్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈద్-ఎ-మిలాద్ నిర్వహిస్తారు. ఇది పబ్లిక్ హాలిడే కనుక ఆ రోజు బ్యాంకులకు సెలవు. 16 వ తేదీ సోమవారం వచ్చింది. అంటే ముందు రోజు ఆదివారం కలిసి వచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే 14వ తేదీ రెండో శనివారం. అంటే వరుసగా 14, 15, 16 తేదీలు సెలవులన్న మాట. ముస్లిం సోదరులకు ఎంతో ఉపయోగం. ప్రజలంతా కూడా ఉత్సాహంగా వరుస సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. బ్యాంకులకు కూడా వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు కూడా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవుల వివరాలు ఇవిగో..
సెప్టెంబర్ 1 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి పబ్లిక్ హాలిడే
సెప్టెంబర్ 8 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 14 రెండో శనివారం సెలవు
సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 16 మీలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే
సెప్టెంబర్ 22 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 28 నాలుగో శనివారం సెలవు
సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సెలవు
దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెప్టెంబర్ నెలలో 15 రోజులు సెలవులు
2024 సంవత్సరం సెప్టెంబర్‌లో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు వచ్చిన సెలవులు 15 రోజులు. అసలు సెప్టెంబర్ నెలకు ఉన్నవే 30 రోజులు. ఇందులో 15 రోజులు సెలవులు రావడంతో బ్యాంకుల పనిదినాలు కేవలం 15 రోజులే అన్నమాట. అంటే సగం రోజులే బ్యాంకులు పనిచేస్తాయి. అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో కాదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు సెలవులొచ్చాయి.
సెప్టెంబర్ 7: వినాయక చవితి
సెప్టెంబర్ 14: ఓనమ్ కేరళ రాష్ట్రంలో నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 16: మీలాద్ ఉన్ నబి
సెప్టెంబర్ 17: మీలాద్ ఉన్ నబి(కొన్ని రాష్ట్రాల్లో)
సెప్టెంబర్ 18: Lhabsol-Pang
సెప్టెంబర్ 20: The Friday after Eid-ul-Fitr
సెప్టెంబర్ 21: శ్రీ నారాయణ గురు సమాధి
సెప్టెంబర్ 23: మహారాజ్ హరిసింగ్ జయంతి
ఇవి కాకుండా
సెప్టెంబర్ 1, 8, 15, 22, 29 ఆదివారాలు. సెప్టెంబర్ 14న రెండో శనివారం. సెప్టెంబర్ 28న నాలుగో శనివారం. ఇలా అన్నీ కలిపి మొత్తం 15 సెలవులు బ్యాంకులకు వచ్చాయి.