Bank FD Vs Post Office Scheme: పెట్టుబడికి ఏది బెస్ట్? ఎందులో ఎక్కువొస్తుంది?
Post office FD vs bank FD: ఇటీవల రెపో రేటు తగ్గడంతో ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింది. ఈ క్రమంలో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా? లేక ఫోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మంచిదా? అనే విషయం తెలుసుకుందాం.

పెట్టుబడికి ఏది బెస్ట్?
Post office FD vs bank FD: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలనుకుంటున్నారా? ఎందులో ఎక్కువ వడ్డీ వస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కూడా వేటుపడింది. పెద్ద పెద్ద బ్యాంకులు కూడా వడ్డీపై కోత వేశాయి. ఇలాంటి తరుణంలో బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయాలా? పోస్ట్ ఆఫీస్ లో ఎఫ్ డీ చేయాలా? ఎందులో చేస్తే ఎక్కువ ప్రయోజానాలు పొందవచ్చు అనే విషయం తెలుసుకుందాం.
బ్యాంక్ ఎఫ్ ఢీపై ఎంత వడ్డీ వస్తుంది?
సురక్షితమైన పెట్టుబడి, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు సరైన ఎంపిక. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు కేవలం బ్యాంకుల్లోనే కాదు పోస్టాఫీసులోనూ చేయవచ్చు. ప్రస్తుతం దేశంలోని చిన్నా, పెద్దా అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై సుమారు 6.5% నుండి 7.25% వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు కొద్దిగా ఎక్కువగా, అంటే 7.5% వరకు వడ్డీ లభిస్తుంది.
అయితే ఈ రేట్లు ఎక్కువగా 3 నుండి 5 సంవత్సరాల కాలపరిమితి FDలపై మాత్రమే లభిస్తుంది. అంటే మీరు FDలో ఎక్కువ కాలానికి డిపాజిట్ చేసినప్పుడే ఈ అత్యధిక వడ్డీ లాభాన్ని పొందగలరు. తక్కువ గడువు FDలపై రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల, దీర్ఘకాల FDలు పెట్టుబడిదారులకు మంచి ఆదాయాన్ని కలిగించే అవకాశముంది.
పోస్టాఫీస్‌లో ఎంత రాబడి వస్తుంది ?
పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించే పలు పథకాలలో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY)పథకాలకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నా, ఇవి అందరికీ అందుబాటులో ఉండవు. SCSS పథకానికి 60 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులు కాగా, సుకన్య పథకం కేవలం బాలికల కోసం రూపొందించబడింది.
అందరికీ లభ్యమయ్యే పథకాలలో పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) ప్రముఖమైనది. ఇది ప్రస్తుతం 7.7% వడ్డీ రేటును అందిస్తోంది. కేవలం ₹1000 తో మొదలుపెట్టి, ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు, అలాగే ఈ పథకానికి పన్ను మినహాయింపు కూడా అర్హత కల్పించే స్కీమ్ కావడం విశేషం. పోస్ట్ ఆఫీస్ పథకాలకు భద్రతతో పాటు, నిర్థిత వడ్డీతో లాంగ్‌టర్మ్ పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్.
బ్యాంక్ ? పోస్టాఫీస్ ? మీ పెట్టుబడికి ఏది బెస్ట్?
మీ పెట్టుబడికి ఏది బెస్ట్ అనేది పూర్తిగా మీరు ఎంచుకునే FDపై ఆధారపడి ఉంటుంది. FDలో డబ్బు పెట్టే ముందు ఆ బ్యాంకు మీకు ఎంత వడ్డీ రేటు ఇస్తోందనే విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. మీరు ఎంపిక చేసిన FD 7.5% కంటే తక్కువ రాబడిని ఇస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) లేదా కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి ప్రభుత్వ భద్రత కలిగిన పథకాలలో పెట్టుబడి చేయడం సరైన ఎంపిక. ఇవి స్థిరమైన, నమ్మకమైన రాబడితో పాటు పన్ను మినహాయింపు వంటి లాభాలను కూడా పొందవచ్చు.
ఎక్కడ పెట్టితే ఎక్కువ లాభం?
పోస్టాఫీసులో 3 ఏళ్లకు రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాడిట్ చేస్తే.. 7.10 శాతం వడ్డీ వస్తుంది. అంంటే 3 ఏళ్ల తర్వాత సుమారు రూ.6,17,538 వరకు పొందవచ్చు. అంటే రూ.1,17,538 లను వడ్డీ పొందవచ్చు.
ఇక బ్యాంక్ విషయానికి వస్తే.. SBI, HDFC, ICICI యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో 3 ఏండ్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. 6.90 శాతం వడ్డీ ఇస్తున్నారు. అంటే 3 ఏండ్ల తరువాత రూ.6,14,598 వస్తాయి. అంటే వడ్డీ రూపంలో రూ.1,14,598 లను పొందవచ్చు. ఈ లెక్కన చూస్తే.. బ్యాంకులో కంటే పోస్టాఫీసులో రూ.2,940 లు ఎక్కవ పొందవచ్చు.
ఇదిలా ఉంటే.. DCB,RBL,యెస్ బ్యాంక్ వంటివి బ్యాంకుల్లో రూ.5 లక్షలను 3 ఏండ్ల పాటు డిపాజిట్ చేస్తే.. 7.50 శాతం వడ్డీ లభిస్తోంది. 3 ఏళ్ల తర్వాత చేతికి రూ.6,24,487 వస్తాయి. అంటే.. పోస్టాఫీస్ కంటే.. రూ.6949 అధికంగా అందుకోవచ్చు. అలాగే కెనరా బ్యాంక్ సైతం 7.20 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.5 లక్షలను 3 ఏండ్ల పాటు జమ చేస్తే రూ.6,19,911 వరకు పొందవచ్చు. పోస్టాఫీసు కన్నా ఇందులోనూ ఎక్కువ పొందవచ్చు.