Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Car: నెలకు రూ. 7వేలు చెల్లిస్తే చాలు.. ఈ బుజ్జి కారు మీ సొంతం చేసుకోవచ్చు.

Car: నెలకు రూ. 7వేలు చెల్లిస్తే చాలు.. ఈ బుజ్జి కారు మీ సొంతం చేసుకోవచ్చు.

ఒకప్పుడు కారు అనేది కేవలం ధనవంతులు ఉపయోగించే విలాసవంతమైన వస్తువువుగా ఉండేది. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబం కూడా కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత కార్ల వినియోగం భారీగా పెరిగింది. తక్కువ ధరలో ఉన్న కార్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు..   

Narender Vaitla | Published : Feb 17 2025, 07:07 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

మధ్య తరగది కుటుంబం కారు కలను నెరవేర్చుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తక్కువ ధరలో కారు అనగానే చాలా మంది సెకండ్ హ్యాండ్ కారులే గుర్తొస్తాయి. కానీ సెకండ్‌ హ్యాండ్‌ ధరలో కొత్త కారు వస్తే భలే ఉంటుంది కదూ! మార్కెట్లోకి అలాంటి కార్లు కూడా వస్తున్నాయి. ఈ జాబితాలోకే వస్తుంది బజాజ్‌ కంపెనీ క్యూట్‌. ద్విచక్ర వాహనాలకు పెట్టింది పేరైన బజాజ్‌ ఈ బుజ్జి కారును తీసుకొచ్చింది. కమర్షియల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ కారును తీసుకొచ్చారు. అయితే పర్సనల్‌ వెహికిల్‌గా కూడా ఈ కారుకు మంచి ఆదరణ లభిస్తోంది. 
 

24
Asianet Image

దేశంలో తక్కువ ధర కారుగా దీనికి గుర్తింపు ఉంది. మారుతి ఆల్టో కంటే తక్కువ ధరలో ఈ కారు లభిస్తుంది. క్వాడ్రిసైకిల్‌ కేటగీరికి చెందిన ఈ కారు దేశపు తొలి ఆటో ట్యాక్సీగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 3.61 లక్షలుగా ఉంది. ఆన్‌రోడ్ వచ్చేసరికి సుమారు రూ. 4 లక్షల వరకు అవుతుంది. ఇక ఈ కారును ఈఎమ్‌ఐతో కూడా సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూపాయి డౌన్‌ పేమెంట్‌ పెట్టకపోయినా 5 ఏళ్ల ఈఎమ్‌ఐ ద్వారా నెలకు కేవలం రూ. 7 వేలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. 
 

34
Asianet Image

ఈ కారును తొలిసారి 2019లో భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ కారును యల్లో, బ్లాక్‌, వైట్ కలర్స్‌లో తీసుకొచ్చింది. అలాగే ఎల్‌పీజీ, సీఎన్‌జీ వేరియంట్స్‌లో ఈ కారును రూపొందించారు. ఈ కారులో 216.6 సీసీతో కూడిన లిక్విడ్ కూల్డ్‌ ఇంజన్‌ను అందించారు. 20.6 లీటర్లు ఈ కారు ఫ్యూయల్ కెపాసిటీ. ఈ కారు పరిమాణంలో చాలా చిన్నగా ఉండడంతో ఎంతటి ట్రాఫిక్‌లో అయినా దూసుకెళ్లొచ్చు. ఆటో గేర్‌, ఏసీ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 
 

44
Asianet Image

ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. LPGపై నడుస్తున్నప్పుడు గరిష్ట పవర్ అవుట్‌పుట్ 12.44 పిఎస్. CNG మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ 11 పిఎస్ అందిస్తుంది. ఈ ఈ కారు గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ బుజ్జి కారులో ఎంచక్కా 4గురు ప్రయాణించవచ్చు. డిజిట్‌ డ్యాష్‌ బోర్డ్‌, 12వీ ఛార్జింగ్ సాకెట్‌ను అందించారు. ఈ కారు బరువు 450 కిలోలు ఉంటుంది. అయితే హైవేలపై వేగంగా వెళ్లే వారికి ఇది సెట్‌ అవ్వదు. 
 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories