MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అదిరిపోయే బిజినెస్ ఐడియా..రాజశ్రీ కోళ్ల పెంపకంతో నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే చాన్స్ ఎలాగంటే..?

అదిరిపోయే బిజినెస్ ఐడియా..రాజశ్రీ కోళ్ల పెంపకంతో నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే చాన్స్ ఎలాగంటే..?

బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా, అయితే పెట్టుబడి ఉంటే సరిపోదు. ఆలోచన కూడా ఉండాలి. అలాంటి బిజినెస్ ఐడియాల కోసం వెతుకుతున్నారా, అయితే కష్టపడాల్సిన పనిలేదు. ఇక్కడ చిన్న పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయం పొందే బిజినెస్ ల గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Krishna Adhitya
Published : Sep 04 2022, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
poultry farm

poultry farm

వ్యవసాయం ద్వారా ఆదాయం తక్కువగా వస్తుందని చాలా మంది నిట్టూరుస్తుంటారు. కానీ ప్లానింగ్ ప్రకారం అగ్రికల్చర్ చేస్తే, మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఇందుకు ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా రాజశ్రీ కోళ్ల వ్యాపారం ద్వారా చక్కటి ఆదాయం పొందే మార్గం గురించి తెలుసుకుందాం. వీటి పెంపకానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. అంతేకాదు వీటికి పౌల్ట్రీ ఫాం తరహాలో కాకుండా ఆరుబయటే పెంచవచ్చు. తద్వారా మీకు ఆరోగ్య కరమైన కోళ్లు లభిస్తాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇక రాజశ్రీ కోళ్ల వ్యాపారానికి మీకు కావాల్సింది. ఒకటి నుంచి రెండు ఎకరాల స్థలం కావాలి. మామిడి తోటలు, లేదా ఇతర తోటల్లో కూడా నాటు కోళ్ల పెంపకం చేపట్టవచ్చు. ఇక కోళ్లను ఉంచడానికి ఒక షెడ్ కట్టుకోవాలి. అలాగే ఇంక్యుబేటర్ కొనుగోలు చేసుకోవాలి. ఇక మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కోడి గుడ్లను సేకరించాలి. వాటిని ఇంక్యుబేటర్ లో పెట్టి పొదిగేలా చేయాలి. అప్పుడు నాటు కోడి పిల్లలు ఏర్పడతాయి. మీరు పెరట్లో పెంచుకోవడానికి రాజశ్రీ కోళ్లు అయితే సరిపోతాయి. 

36

ఈ కోళ్లు మధ్యస్థంగా బరువు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటుగా, పట్టణ ప్రాంతాల్లో కూడా వీటిని ఇష్టంగా తింటారు. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ కోళ్లు వేగంగా కదులుతాయి. అంతేకాదు కుక్కులు, పిల్లులు, గద్దలు వంటి జంతువులకు దొరకవు. అంతేకాదు వీటి గుడ్లు కూడా గోధుమ రంగులో ఉంటాయి. అందుకే వీటిని సాధారణ కోడి గుడ్ల కన్నా కూడా ఎక్కువ ధరకు విక్రయించవచ్చు. 

46

ఇక రాజశ్రీ కోళ్ళ బరువు విషయానికి వస్తే ఒక రోజు వయసు కోడిపిల్ల బరువు 38-40 గ్రాములు వరకూ ఉంటుంది. సరిగ్గా 20 వారాలకు వీటి బరువు సుమారు 1000 గ్రాములు నుంచి 1200 గ్రాములు వరకూ పెరుగుతుంది 160 రోజులకు ఇవి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఇవి సుమారు 72 వారాల వరకూ 150 గుడ్ల వరకూ పెడతాయి. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కవగా ఉంటుంది. 

56

మొదటి ఆరు వారాల పాటు కోడి పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాల. వీటికి ఫిలమెంటు కలిగిన బల్బులను షెడ్డులో ఏర్పాటు చేసి వేడి తగిలేలా ఉంచాలి. ఆ తర్వాత కోళ్ల వీటిని పెరట్లో స్వేచ్ఛగా వదిలి పెంచుకోవచ్చు. స్థానిక వెటర్నరీ డాక్టరు సహాయంతో వీటికి కావాల్సిన మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వీటి గుడ్లను, అలాగే కోళ్లను విక్రయించుకోవచ్చు. బ్యాచుల వారీగా గుర్తించి ఒక భాగం గుడ్లను విక్రయించి, మరో భాగం గుడ్లను ఇంక్యుబేటర్ సహాయంతో పొదిగి పిల్లలను పెంచవచ్చు. 

66

ఇక మార్కెట్లో రాజశ్రీ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిని నేరుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. 

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది? వడ్డీ భారం నుంచి ఎలా తప్పించుకోవాలి?
Recommended image2
SIP Investment : నెలకు ₹10 వేల పెట్టుబడితో ₹4.7 కోట్ల రిటర్న్స్.. కోటీశ్వరులు కావాలంటే ఇది చూడాల్సిందే!
Recommended image3
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved