MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?

Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?

Best Car: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్సులలో ఏది కొనాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ముందుగా ఆ రెండింటి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 11 2026, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కారు కొనేటప్పుడు గమనించాల్సినవి
Image Credit : Google

కారు కొనేటప్పుడు గమనించాల్సినవి

కారు కొనడం సైకిల్ కొన్నంత సులభం కాదు. ఏ కారు బాగా పనిచేస్తుంది?  సీట్లు ఎలా ఉన్నాయి? చూడటానికి అందంగా ఉందా అని మాత్రమే చూస్తే సరిపోదు. కారు కొనేటప్పుడు దాని ఇంజిన్, మైలేజ్, ఫీచర్లు, అన్నింటికన్నా ముఖ్యంగా అది ఆటోమేటిక్ లేదా మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉన్నదా అనే విషయాలు తెలుసుకోవాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మాన్యువల్, ఆటోమేటిక్..
Image Credit : Google

మాన్యువల్, ఆటోమేటిక్..

ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల కార్లు ఉన్నాయి. వీటిని మాన్యువల్, ఆటోమేటిక్ అని రెండు రకాలుగా విభజించారు. ఈ రోజుల్లో చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు దాదాపు ప్రతీ మోడల్ లో ఈ రెండు రకాలు ఉంటున్నాయి. రెండింటిలో ఏది ఎంచుకోవాలన్నా మీ అవసరాలను, మీరు డ్రైవ్ చేసే పద్ధతిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రెండు రకాల కార్లకు లాభనష్టాలు ఉన్నాయి.

మాన్యువల్ కార్ల గురించి చెప్పుకుంటే వీటికి మంచి హ్యాండ్లింగ్ ఉంటుంది తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్ వంటివి ప్లస్ పాయింట్స్. గేర్లపై డ్రైవర్‌కు పూర్తి కంట్రోల్ ఉంటుంది. కానీ, భారీ ట్రాఫిక్‌లో పదేపదే క్లచ్ నొక్కడం అలసటగా ఉంటుంది. అలాగే,ఇవి నడపడం నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

Related Articles

Related image1
Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే
Related image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
34
మాన్యువల్ కారు వల్ల లాభ నష్టాలు
Image Credit : Google

మాన్యువల్ కారు వల్ల లాభ నష్టాలు

తక్కువ ధర: ఆటోమేటిక్ కార్లతో పోలిస్తే ఇవి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు తక్కువ ధరకే దొరుకుతాయి.

మంచి మైలేజ్: ఆటోమేటిక్ కార్ల కన్నా మాన్యువల్ కార్లు నడపడం వల్ల ఎక్కువ మైలేజ్ వస్తుంది.

తక్కువ నిర్వహణ ఖర్చు: వీటి గేర్‌బాక్స్ సింపుల్‌గా ఉంటుంది. అందుకే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువ.

పూర్తి కంట్రోల్: డ్రైవర్లు తమకు కావాల్సినప్పుడు గేర్లు మార్చుకోవచ్చు.

డ్రైవింగ్ ఎంజాయ్‌మెంట్: డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

నష్టాలు:

ట్రాఫిక్‌లో అలసట: సిటీ ట్రాఫిక్‌లో పదేపదే క్లచ్ నొక్కడం వల్ల కాళ్లు నొప్పి పెడతాయి, త్వరగా అలసిపోతారు.

నేర్చుకోవడం కష్టం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి క్లచ్, గేర్లను బ్యాలెన్స్ చేయడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు.

ప్రమాదం: ఎత్తుపల్లాల వద్ద క్లచ్‌ను సరిగ్గా కంట్రోల్ చేయకపోతే, కారు ఆగిపోవచ్చు లేదా వెనక్కి జారిపోయే ప్రమాదం ఉంది.

టెక్నాలజీ: ఆటోమేటిక్ కార్లతో పోలిస్తే, వీటిలో కొత్త టెక్నాలజీ ఫీచర్లు తక్కువగా ఉంటాయి.

44
ఆటోమేటిక్ కార్లు
Image Credit : our own

ఆటోమేటిక్ కార్లు

ఆటోమేటిక్ కార్లు నడపడం చాలా సులభం. క్లచ్, గేర్లతో పనిలేకుండా ట్రాఫిక్‌లోనూ హాయిగా ప్రయాణించవచ్చు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి ఇవి చాలా ఈజీ. స్మూత్ డ్రైవింగ్, తక్కువ అలసట, మెరుగైన భద్రత వంటి లాభాలు ఉన్నప్పటికీ, ఇవి చాలా ఖరీదైనవి.

ఆటోమేటిక్ కార్ల లాభాలు

సులభమైన, సౌకర్యవంతమైన డ్రైవింగ్: భారీ ట్రాఫిక్‌లో పదేపదే క్లచ్, గేర్లు మార్చాల్సిన పనిలేదు. ఇది కాళ్లకు విశ్రాంతినిస్తుంది.

కొత్త డ్రైవర్లకు బెస్ట్: కొత్తగా నేర్చుకునేవారికి గేర్లు, క్లచ్ బ్యాలెన్స్ చేయాల్సిన తలనొప్పి ఉండదు కాబట్టి ఇది చాలా మంచి ఆప్షన్.

స్మూత్ ఎక్స్‌పీరియన్స్: గేర్లు ఆటోమేటిక్‌గా మారుతుండటంతో డ్రైవింగ్ స్మూత్‌గా ఉంటుంది.

భద్రత, సౌకర్యం: కొండ ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో కారు వెనక్కి జారకుండా ఇది నిరోధిస్తుంది.

నష్టాలు

ఎక్కువ ధర: మాన్యువల్ కార్లతో పోలిస్తే ఆటోమేటిక్ కార్ల ధర ఎక్కువ.

తక్కువ మైలేజ్: ఆటోమేటిక్ కార్లు సాధారణంగా మాన్యువల్ కార్ల కంటే తక్కువ మైలేజ్ ఇస్తాయి.

ఖరీదైన నిర్వహణ: వీటి గేర్‌బాక్స్‌ను రిపేర్ చేయడానికి, మెయింటెయిన్ చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ.

తక్కువ కంట్రోల్: ఓవర్‌టేక్ చేసేటప్పుడు, మాన్యువల్ కార్లలో ఉన్నట్లుగా గేర్లపై పూర్తి కంట్రోల్ ఉండదు. అయితే, కొత్త టెక్నాలజీతో వచ్చిన ప్యాడిల్ షిఫ్టర్‌ల వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే
Recommended image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved