MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పిల్లల పెళ్లి, చదువు కోసం డబ్బు దాచాలని ప్లాన్ చేస్తున్నారా, మీ కోసం బెస్ట్ ఆప్షన్స్ ఇవే..

పిల్లల పెళ్లి, చదువు కోసం డబ్బు దాచాలని ప్లాన్ చేస్తున్నారా, మీ కోసం బెస్ట్ ఆప్షన్స్ ఇవే..

ప్రతి ఒక్కరూ తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం సహజమే. పెరుగుతున్న ఖర్చుల యుగంలో, నేడు పిల్లల పెంపకం, వివాహం కోసం చాలా ఖర్చు అవుతోంది. కావున ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో తమ పిల్లలకు అవసరమైన ఖర్చులకు తగిన డబ్బును దాచుకోవాల్సిందే. ఇందుకోసం తల్లిదండ్రులు ఏ పథకాల్లో పెట్టుబడి పెట్టాలా అని తల పట్టుకుంటున్నారు. తమ పిల్లల అవసరాలకు సరిపడా డబ్బును పొదుపు చేయడం చాలా కష్టంగా మారిపోతోంది.

2 Min read
Author : Krishna Adhitya
Published : Sep 05 2022, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పెట్టుబడికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై శ్రద్ధ తీసుకోకపోవడమే ఇందుకు కారణం. పెట్టుబడి సరైన సమయంలో, సరైన సాధనంలో చేయకపోతే, మీరు ఊహించినట్లుగా మీకు రాబడి ఉండదు. అందుకే మీరు మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పిల్లల కనీస అవసరాలైన చదువులు కోసం డబ్బు దాచడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఉన్నత విద్య, విదేశీ విద్య కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ఈ రోజుల్లో పెళ్లికి కూడా చాలా డబ్బు ఖర్చవుతోంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత త్వరగా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మీరు బిడ్డ పుట్టిన వెంటనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీ బిడ్డకు 18 ఏళ్లు వచ్చే సమయానికి మీరు మంచి మొత్తంలో డబ్బు సేవ్ చేయవచ్చు. 

35

సరైన పెట్టుబడి అవసరం
మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, మీరు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడం కూడా ముఖ్యం. సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం, LIC  జీవన్ తరుణ్ ప్లాన్, చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్ వంటి అనేక పథకాలు మార్కెట్లో ఉన్నాయి, వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయవచ్చు. రిటర్న్స్ ప్రకారం చూస్తే  ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక.

45

ఆర్థిక క్రమశిక్షణ అవసరం
పిల్లల కోసం ఫండ్ చేయడానికి, మీరు ఏదైనా సందర్భంలో ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. ఇది స్వల్పకాలిక పెట్టుబడి కాదు. దీని కోసం మంచి ప్రణాళిక మరియు నిరంతర కృషి అవసరం. మీరు ఏ పెట్టుబడి ప్రణాళికలో పెట్టుబడి పెట్టినా, అది నిరంతరంగా ఉండాలని గుర్తుంచుకోండి.

55

పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం
పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఉండటం ముఖ్యం. ఒక ఇన్వెస్ట్‌మెంట్ లేదా సేవింగ్స్ స్కీమ్ నుండి తక్కువ రాబడి వచ్చినప్పటికీ, దానిని వేరే చోట చేసిన పెట్టుబడుల ద్వారా భర్తీ చేయాలి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను వివిధ అసెట్ క్లాస్‌లుగా విభజించడం వల్ల మీ పోర్ట్‌ఫోలియోకు బ్యాలెన్స్ లభిస్తుంది. పిల్లలతో పాటు, వారి భవిష్యత్తు కోసం కూడా పెట్టుబడి పెట్టాలి. మీకు కనీసం బీమా ఉండాలి.

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Railway: రైలు ప‌ట్టాల పక్క‌న ఉండే ఈ సిల్వ‌ర్ బాక్స్‌లు ఏంటి.? వాటి ప‌ని ఏంటో తెలుసా.?
Recommended image2
Cooler: క్లౌడ్ టెక్నాల‌జీతో ప‌నిచేసే కూల‌ర్‌.. అస‌లేంటీ టెక్నాల‌జీ, దీంతో జ‌రిగేదేంటీ.?
Recommended image3
Gold Rate Fall: పసిడి ప్రియులకు కళ్లు చెదిరే అప్ డేట్..తులం బంగారం ఎంత తగ్గిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved